పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు

చాగింపఁగా వచ్చిన లబ్ధి మిరువదియైదుకాఁగా, పదిచిటికల కాలములో దుముకఁగల దూరము నాలుగుయోజనములు చేత నిరువదియైదును నాలుకు చేత నిరువదియైదును నాలుగు చేత గుణించి సముద్రము యొక్క వెడవులు సరిగా నూఱుయోజనములని తెలిసికొని నేనత్యాశ్చర్య పడితిని. ఆహా! మన పూర్వుల సామథక్యాము నేమని శ్లాఘీంతుము! వారు నిజముగా సర్వజ్ఞలేనిండీ. అణుమాత్రమయినను హెచ్చుతగ్గులు లేక నూఱు యోజనములని రామాయణములోఁ జెప్పినదానికిని నేను కన్నురాలా కొలిచి లెక్కవేసినదానికిని సరిగా సరిపోయినది. లంకకును మనదేశమునకును నడుమనున్న సముద్రమిదియేకదా? నేను సముద్రమును దాఁటునప్పుడు శ్రీరాములవారు కట్టిన వారధిని స్పష్టముగా జూచినాను. మనుష్యులు లంకకుఁ బోవకుఁడుటకయి మరలివచ్చునప్పుడు శ్రీరాములు వారు కట్టను నడుమనడుమ తెగఁగొట్టీన సందులను నాకంటికి కరతలామలకముగాఁ గనఁబడినవి. మన పూర్వులను గురించి యాలోచించుచు నేను కొంచె మేమఱియుండగా వానరమన్నను వన్నుమీది నుండి తోఁకతో పైకెత్తి మఱియొక్కదుముకు దుమికినది. ఈసారి నేను వీపు మీదనానుకొని ద్రడముగా నుండక వాలమున వ్రేలుచు భయభ్రాంతుఁడయిన యుండుటచేత చిటికలు వేసి దూరమును కనుఁగొన లేకపోయినాను. నేనిట్లు దిగ్భ్రమ నొందియుండఁగానే యావానరము నన్ను నట్టడవిలో విడిచి యద్రుశ్యమయినది. అప్పటికి సూర్యగతిని బట్టి నాలుగయిదు గడియలు ప్రొద్దెక్కినట్టు తోఁచినది. కన్నులువిచ్చి చూడఁగా నక్కడి చెట్లు మొదలైనవి లంకలోని వానివలె నత్యున్నతములు గాక మనదేశములోని సామాన్య వస్తుజాలము వలెనే యున్నవి. ఆవాసరము యొక్క వీపునానుకొని సముద్రను దాటునప్పుడు నాకు తోఁచలేదు. గాని నన్నిక్కడకుఁగొనివచ్చి విడిచిన యా మహానుభావుఁడెవ్వఁడా యన్న్నయాలోచన నా మనస్సునకిప్పుడు కలిగినది. అతఁడు వాయు