సత్యరాజా పూర్వదేశయాత్రలు
బెట్టియోహోమము నిమిత్తమై బ్రాహ్మణులు పశువును బట్టీట్టుగా నూపిరివడలనియ్యకనాప్రాణములు గొనఁదలఁచినందున మక్కటమునాహవనీమాగ్నియని చెప్పవచ్చును.ఈమూఁడగ్నులలో నాకప్పుడుదక్షిణాగ్ని మేలుగతోఁచి నందున నాయజమానుఁడైన మహాకాయుని వద్దఁజేరి సుఖింపవచ్చునన్నయాశచేతనేను తా కచేతిలోఁజిక్కిఁదలఁచు కొని వానరముయొక్క యొడిలోనుండిదుమికి యారాక్షసినికౌఁగిలించుకొనుటకయి చేతులుచాఁచుకొని సంసిద్ధుఁడనయి కూరుచుండియుంటిని. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచునుగదా! తాటక వృక్షమారోహించుట చూచి యాదుష్టవానరము నన్ను విడిచి పాఱిపోకి తనతోఁకను నేను మొదట ననుకొన్నట్టుగా నామెడకుఁగాక నాపొట్టకు చుట్టఁబెట్టి నన్ను తనవీపుమీఁద నదిమిపెట్టి యా చెట్టుమీఁది నుండి మఱియొక చెట్టుమీఁదికి దుమికెను.అంతట తాటక చెట్టు దిగివచ్చి హిడింబితో నేమో యాలోచించి వానరమును రాళ్ళతో విసరనారఁభించెను.దానికి సహాయురాలయి హిడింబియు మామీఁద శిలలు రువ్వసాగెను.ఆ శిలాయుద్ధమునకు తాళఁజూలన వానరరాజు చెట్టుమీఁదినుండి యుఱికి నన్ను వీపుమీఁద వేసికొని పాఱిపోవఁ జొచ్చెను. వెనుకనుండి యఱచుచు నారాక్షసాంగన లిరువురును మమ్ము తఱుముకొని వచ్చిరి.ఇట్లు కొంత దూరము పరుగెత్తు నప్పటికి వెనుకఁ జెప్పిన మహాకాయుని భృత్యులిద్దఱును ప్రక్కదారినివచ్చి వారిని గలిసికొని యేలపరుగెత్తుచున్నారని యడిగిరి. ఆ చెడుకోఁతి వాలఖల్యుని నెత్తుకొని పాఱిపోవుచుండగా విడిపించుటకయి పరుగెత్తుచున్నానమని వారుత్తరము చెప్పిరి. ఇట్లు నలుగురును నొక్కచోటఁ జేరునప్పటికి పూర్వము నన్ను మందోదరి యప్పుడప్పుడు తీసికొని వచ్చెడి యుద్యానవనముకడకు మేము వచ్చితిమి.ఆంట నలుగురును గలిసి తన వెంటఁబడ మర్కటరా జణుమాత్ర