పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


మరల నేపెట్టెలోనో పఱపుక్ర్రిందనో పెట్టి త్రిజట నన్ను దాచినపక్ష మున నేనీసారి యూ పిరివెదలక యజ్ఞా పశువువలె చావ వలసి చ్చును .అని యాలోచించుకొని హిడింబిచ్చులోపలనే పొదవిదిచి పాఱిపో వలెనని నిశ్చయించుకొని నేను మెల్లగ పయికి వెడలివచ్చి యొక చెట్టు చాటునకు నడిచితిని. ఇట్లొక చెట్టుముదలుచేరి నలుదిక్కులకును చూడ్కి నిగిడించునప్పటి తాటక చేతకఱ్రధరించి మ్యత్యుదేవతవలె నావంకకే వచ్చుచుండెను. మరియొక దిక్కునుండి శ్మశానములుదాటి పెద్దవనరమొకటి నావంకకే వచ్చుచుండెను. ఇంకొక దిక్కు నుండి యాపురుషులను విడిచి హిడింబి యొక్క తెయునావంకకే పరుగెత్తుకొని వచ్చుచుండెను. త్రేతాగ్నులవలె మూడు రూపములును నాకంట బడగానే నాకప్పడు ముగ్గురు మృత్యుదేవత లాసన్న మయినంత భయమునేసినది. చెట్టున కెగబ్రాకుదమన్న దాని ప్రకాండము నాకొగిటి కొదుగదు తొఱ్రలో దూరుదమన్న నెందు వెదకినను తొఱ్ర గానరాలేదు. ఏమిచేయుటకును దోచక నేనుదిగ్భృమ నొంది దిక్కులు చూచుచుండగా ముండగా హిడింబి వచ్చి పొదచేరి నన్నే కాబోలును వెదక నారంభించెను. ఇందులో తా టకవచ్చి పెట్టెచేరి మూత తెఱచి యాశ్చర్యపడ నారభించెను. అప్పుడు తాటక హిడింబిని జూచి నీవాపొదలో నేమి వెదకుచున్నావని యడిగెను. నీవు కర్రకొరకు పోయిన తరువాత నెలుక యెంత యున్నదో చూడవలెనన్న చపలత్వముచేత పెట్టెమూత యిట్టెతీయఁగా నొక్క యెగురెగిరి యీవలబడి యెలుక యీపొదలో దూరినందున దానిని వెదకు చున్నానని హిడింబి యుత్తరము చెప్పెను. నేనామాట లాలకించుచు నేమఱియున్న సమయమునందు మెల్లగా వానరము నావద్దకు వచ్చి నన్ను చంకఁబెట్తుకొని చెట్టుమీదికెగఁబ్రాకెను.నాదుస్స్పప్న ఫలమిపిడు నాకు పూర్ణముగా ననుభవమునకు వచ్చినది.నాకు కలలోఁ

53