పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశియాత్రలు

గనఁబడిన కోతియేయిప్పుడు ప్రత్యక్షమయినన్ను వృక్షాగ్రమునఁబెట్టినది. అక్కడనుండిక్రిందకి జాఱిపడితినా చట్రాతిమీఁదఁబడిన గాజుకాయ వలెనాతల వేయివ్రక్కలుకాకమానదు. ఏకొమ్మనైనను గట్టిగాకౌఁగిటఁ బట్టుకోవలెనన్నుపట్టు కోనీయకయీపాడు కోతియెడమచేతితో భల్లూకపుపట్టుపట్టినన్నొడిలోఁబెట్టుకొనికదలనియ్యకున్నది. చెట్టుపయిని నేనిట్టియవస్థలోనుండగా క్రిందహిడింబి యుతాటకయునన్ను వెదకుచునేనున్న చెట్టుమొదటికివచ్చిరి.

తాట-అయ్యో!చేతఁజిక్కినయెలుకనునిష్కారణముగాఁబోగొట్టితివిగదా!
హిడిం-నీవుకఱనిమిత్తమయిపోయియెంతసేపటికినిరాకపోఁగానెం తపెద్దయెలుకోచూడవలెననిమూతకొంచెముతీయఁగానేయెలుకపైకుఱికిపాఱిపోయినది.

తాట-మహాకాయునియింటనున్నవాలఖిల్యమహర్షినెవ్వరోయెత్తుకొనిపోయినారనిచెప్పుచుండగావినుచునులుచుండుటచేతకఱతెచ్చుటకుకొంచెమాలస్యమయినది.ఎలుకపైకి రాఁగానే తఱుముకొని పోయిపట్టు కోలేక పోయినావా?

హిడిం:ఇంతలో మహాకాయుని భృత్యులిద్దఱిక్కడకు వచ్చియుండని యెడలదానినినేనుపోనిత్తునా? వాలఖిల్యమహషి౯రాత్రి యంతర్థాన మయినమాటచెప్పుచువారునన్నుకొంతదూరముతమవెంటఁగొనిపోయినారు.

తాట-ఇక్కడకలుగులులేవు.ఎలుక యీచెట్టుపైకిప్రాఁకలేదు గదా?
హిడిం-ఎలుకలుచెట్లెక్కునా?
తాట-చూచితివాచెట్టు మీఁదనెంత పెద్దవానరమున్నదో?
హిడిం-ఏది? అదా? అవునవును. దానియొడిలో నేమో యున్నట్టున్నది.