పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

 

హిడిం ---- ఇక్కడకు నాలుగుయోజనముల దూరములోనున్న తోఁటలోనున్నది. దారిచూపెదను రండి.

అని వారిని తిఅసికొని హిదించి ప్రక్కపండునకు తిరిగి యదృశ్యయైనది "మీరనుకొన్ని నాలఖిల్యుఁడను నేనే ! నాపేరు సత్యలను పేరులు పెట్టిపిలిచి కొంతుపగులునట్టుగా నఱచితినిగాని నామాట వారు వినిపించుకొన్న వారుకారు. పొదనుండివెడలి వారివంట పరుగెత్తుటకు తాటక కఱ్ఱగొనివచ్చి యెడ్కడచావమోఁదునో యన్నభీతిచేతి నాకు సాహసము లేకపోయినది.

                                                                   ----

ఎనిమిదవ ప్రకరణము.



                                                                    ----
హిడింబి నన్ను పొదలోఁ గూరుచుండఁ బెట్టి పోయినతరువాత మనస్సులో పరిపరిలాగున నాలోచనలు కలుగఁజొచ్చినవి. తాటక కఱ్ఱగొనివచ్చి చావఁగొట్టునేమోయన్న భయము మొట్టమొదట పుట్టినది. గాని యారక్షసిపెట్టెలోనున్నది యెలుక యనుకొని యెలుకను చాపమోఁదునిమిత్తము కఱ్ఱకొఱకు వళ్ళినదన్నమాట స్మరణ్కకు వచ్చినతరువాత భయనివారణమయినది. ఇంతలో హిడిఁబివచ్చి నన్నుపట్టుకొని యేమిచేయునో యన్నభయము మఱియొకటివచ్చి నామనస్సును మఱింత బాధింపఁజొచ్చినది. హిడింబి చేతిలోమరలఁ జిక్కకొన్నపక్షమున నాకు మరణవేదకన్నను క్రూర తరమయిన బాధ సంభవించును, అది నన్నొడిలోఁ బెట్టుకొనిపోయి తనచెలియైన త్రిజటకు మరల సమర్పించినపక్షమున,త్రిజటనన్నేమి బాములఁబెట్టునో!