పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                            లంకాద్వీపము 407
  మహాయుద్ధము సంభవించుననియు మిరెఱుఁగునురు. మనుష్యాశనుఁడగుటచేత నన్ను మింగవలెనని యారాక్షసుఁడే మొట్టమొదట నామిఁడఁడెనో దుష్టశిక్షణము చేయవలెనని నేనే మొట్టమొదట రాక్షస సంహారమునకు పూనితినో వీరావేశపరశుఁడ నయి యుండుటచేత నేను నిశ్చయముగాఁ జెప్పులేనుగాని మాయిరవురకును జరిగిన యుద్ధము దేవాసురయుద్ధమును మించినదనిమాత్రము దృఢముగాఁజెప్పుఁగలను ఆరంభదశలో కొంతసేపు మాయిరువురకును బాహాబాహిని సఖానఖిని దంతాదంతిని ఘేరయుద్ధము జరగినది. నాకుమారుని మిదికి దుముకు గరుత్మంతునవని నే నారాక్షసునిమిఁదకి కుప్పించి యుఱికి నారెండు బాహువులతోను వానిబాహు వొకటి యొడిసిపట్టి శ్రీకృష్టులవారు గోవధనగిరి యెతినట్టు పయికేత్తి గిరగిర త్రిపి నేల మిఁదవేసి కోట్టఁఅబోయితిని. కాని యారాక్షసుఁడు క్రిందఁబడక మాయచేసి తనబాహులతో నాచేయి గట్టగాపట్టుకోని వదలక కత్తుల వంటి తన డెక్కతో నాకత్తుక కత్తిరించి వలెననియె యమపాశ ములవంటి తనబాహుపాశముల నాఱింటిని నామెడకోక్కసారిగా చుట్టి బిగించి యూపిరివెడలనీయక ప్రాణములు గోనవలెననియె దక్షిణ భుజముమిఁదుగా నాకంటసమిపమునకు ప్రాకఁ జొచ్చెను గాని నేనింతలోమెలఁవకపడి మెచేతివద్దికి పరుత్తునప్పుటికి యెడమచేతితో నేరాక్షసుని కాలుపట్టుకొని నేలమిఁదమెఁపి సింహనాదము చేసితిని. నాసింహనాదముయొక్క దారుణధ్వనిచేత దిగ్గజముల చెవులకు చెవుడు పట్టియుండును.ఆకాశమునుండి గవ్వలవలె నక్షత్రములన్నియు నేలమిఁద రాలియుండును.నేనప్పుడాపెట్టెలో నిర్భంధింపఁబఁడి యుండుటచేత పయికివచ్చి చూడలేకపోయితినిగాని లేని యెడల క్రిందరాలిన నక్షత్రములను కొన్నిటి నేఱిమూటకట్టి తెచ్చి నామటకు నిదర్శనముగాను నాపౌరుష ప్రకటన మగునట్లుగాను మి