పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


నుబ్బి మెత్తగానున్న, యాచరమకాయమునకంటి దానిలో చతురాంశమంతయున్న పూర్వకాయమున్నది; ఆ పూర్వకాయమునకు ప్రక్కకు మూఁడేసి చొప్పున రావణాసురుని భుజమువలె నారుకాళ్ళున్నవి; దక్ష ప్రజాపతిమెడ కతికించిన మేషశిరస్సువలె చిన్నదిగా నున్న దాని శిరస్సున కిరుపాశ్శ్వములయందును పట్టుకారువలె రెండుడెక్కలున్నవి; దాని దేహచ్చాయ యమవాహనమైన మహిషచ్చాయను బోలి నామనస్సున కప్పు డంధకాసురుని స్మరణకు తెచ్చినది. నాకన్నులయెదుట నట్లు నిర్భయముగా నిలువఁబడిన యాజంతువు పయికి మత్కుణమువలె కానబడినను అది కామరూపప్రభావముచేత నట్టి రూపమును వహించిన ఘోరరాక్షసుఁడయినందుకు సందేహము లేదు. విద్వన్మహాసభలో నేనట్లు ప్రతిపక్షుల నోడించి జ్యోతిశాస్త్రము నాచంద్రార్కముగా నిలువబెట్టిన నాటినుండియు పరాజితులయిన క్రూరరాక్షసులు నామీద పగపట్టి నానావిధమాయవేషములు చేత నాకాపయముచేయ జూచుచున్నారు. ఆ దేశమందలి జ్యోతి శ్శాస్త్రమహిమచేత నేటిరాత్రి నేనీపెట్టెలోనుందునని ముందుగాఁ దెలుసుకొని నాకు హానిచేయవలెనన్న ద్రోహబుద్ధితో వచ్చి యవ్వడో యొక రాక్షసుడు నాకంటె ముందుగానే పెట్టెచొచ్చి దాఁగియున్నాఁడు. అట్లు కానియెడల తాళమువేసిన పెట్టెలోని కాజంతు వెట్లు వచ్చును?వచ్చినను మత్కుణరూపము నేల ధరించును? ధరించినను నేనువచ్చినదాఁక దాఁగియుండి దొంగవలె నేమరుపాటున మీదబడి నన్నేల కరుచును?ఇన్ని హేతువులనుబట్టి యాజంతువు రాక్షసుఁడగుట నిశ్చయము. అయినను నాకిప్పుడీరాక్షసునిపేరు తెలియనందున నిజమైనపేరు బయలఁబడువరకును మనకధాంశము నిమ్మితము నేనాతని మత్కుణాసురుఁడని పిలిచెదను. నేను భూదేవుఁడ నన్నయంశము మీకు తెలిసినదే కదా. దేవతలు రాక్షసులను తారసిల్లినప్పుడు