పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

చేయవలెనో తెలియకున్నది; ఈపెట్టెలోనుండి ముందుగా నీవలనఁబడినఁగదా తరువాత ప్రతిక్రియమాట యాలోచింపవలెను? నాశత్రువు లెవ్వ రేరూపమును ధరించివచ్చి నా కేయవాయమును సేయు దురోయని వాయుల్లము తల్లడిల్లుచున్నది. హా: దైవమా: ఏమిచేయుదును? కామరూపమునుపొందు శక్తిని మాభరతఖండవాసుల కెప్పుడును ప్రసాదింపకుము. ఈకామరూపధారణము దుష్టులకు మాయవేషములు వేసుకొనివచ్చి సాధువులకు హానిచేయుట కొఱకేకాని మంచివారి కేసత్కార్యములు చేయుటకొఱకును నావశ్యకమైనది కాదని నాకిప్పుడనుభవము వలనఁ దెలియుచున్నది.

ఏడవ ప్రకరణము.

ఆ పెట్టెలోనే నొకబట్టమడతమీఁద గూరుచుండి పైని చెప్పినట్లు నాలోనే నాలోచించుకొనుచుండఁగా నేదో తేల్లుకుట్టినట్టు నావడ్డిమీఁద నొకపోటుపొడినది. ఆపోటుతో నాధ్యానమంతయు చెడినందున నిప్పుతొక్కిన క్రోఁతివలె నొక్క యెగిరెగిరి యులికిపడి లేచి నాలుగుమూలలను గంతులువైచుచునిది యాదుస్స్వప్న ఫలమని భయపడుచు ముందుకు తిరిగిచూచునప్పటికి నాకన్నులయెదుట మన మూవకమంత జంతువొకటి మహాభయంకరముగా కానఁబడెను. అది యెలుకవలెనున్నను దానికి తోఁకగాని వెనుకవైపున కాళ్ళుగాని యేమియులేవు, అవయవరహితమై తోలుకప్పిన యెముకలులేని నల్లని మాంసపుమద్దవలె నున్న యాచరమకాయమే దానిశరీరములో నాలుగింట మూఁడువంతులున్నది: ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తివలె