సత్యరాజా పూర్వదేసశయాత్రలు
కుఁజూపి మికద్భుతము కలిగించియుందును. నేను విసరివైచినప్పు డారాక్షనుఁడు పర్వతమువలె నేలఁగూలియు చావక బట్టమడత మీదపడి మరల లేచి మహావేగముతో నావంక పరుగెత్తుకొని రాఁజొచ్చెను. నేను నెదురుగాఁబోయి కుంజరము మిఁదికి కుప్పించు సింహమువలె రాక్షసుని మిఁదికి లంఘీంచి కొలఁదిని నొక్కతన్ను తన్నితిని. ఆతన్ను తగిలియున్నయెడల వాఁడుపొట్ట పగిలి చావవలసినవాఁడే కాని యారక్షసుఁడు తన మాయబలము చేత నపాదఘాతమును తప్పించుకొని ప్రక్కకు తొలఁగెను. ఆపదతలాఘాతమ చేతపెట్టెయంతయు నదిరిపర్వత గుహవలెమాఱుమోసెరు. నాకాలి తాకుఁన పెట్టెక్రిందకి దిగిపెట్టెతోగూడ భూమి పాతాళమంటక్రుంగుటచేత నాడుశేషుని తలలకెంతోనొప్పి కలిగియుండును. అతడాదుర్భర వేదనచేత శిరసుకదల్చి నప్పుడు భూకంపము కలుగకమానదు. ఓభరతఖండవాసులారా! హూణశకము ౧౮౮౬ వ సంవత్సరముమార్చి నెలయేడవ తేదిని గాని దానికి కొన్నిదినములీవలావలను గాని భూకంపము కలిగినదేమో స్మరణకుఁదెచ్చు కొనుడు. ఆకాలము నందెక్కడనైనను భూకంపము కలిగినట్లు మీకుజ్ఞప్తికివచ్చినను వార్తాపత్రికల యందు చదివినను పెద్దల వలనవినినను స్వప్నముల యందుజూచినను, అదినాపాద తాడనముచేతనే యైదనిగ్రహింపుడు. ఎన్నివిధముల చేత విచారించినను మీ కాభూకంప వాతా౯గోచరముకాని పక్షమున మీరు మన పంచాంగ్ములను జదివి వాని యందైనను జూచి జ్యోతిష శాస్త్రమహిమకు సంతోషింపుడు. ప్రక్కకు తొలగిన యా రాక్షసుడు బట్ట మడత చివర వరకూ పరుగెత్తి యక్కడ నుండి మరలి మరల నావంకకు నడివ నారభింపగా నేను వెనుకకు బోయి పార్శ్వ భాగమునకు వచ్చి యెక్క కాలొడిసిపట్టి ద్వంద్వ యుద్ధము కారంభించితిని. భీమ దుర్యోదనులకు జరిగిన ద్వంద్వ యుద్దము వలె మాపోరాట