Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396
వృశ్చి__జ్యోతిశ్శాస్త్ర మాద్వీపమునకు చెల్లదు.

మహ__విశ్వాసహీనులకును నిరక్షరకుక్షులకును గ్రహములు సహితము ఫలములను కలిగింపవు.

ఉప__ప్రత్యక్షవిరోధముచూపినను చూడనొల్లక కన్నులు మూసికొని జ్యోతిశ్శాస్త్రము సత్యమని చెప్ప నిశ్చయించుకొని వచ్చిన వారిముందర యుక్తివాదమువలన కంఠశోషణము కలుగుటతప్ప వేరు ప్రయెజనము కలుగదు. ఈపాడు జ్యోతిశ్శాస్త్రము మనదేశమున కెంతహానినైనను జేయుచున్నది.కొందరు సిద్ధాంతులు చెప్పినయా యు:పరిమాణమును నమ్మి తమకు చావుసమీపించిన దనుకొని బెంగపెట్టుకొని నిష్కారణముగా దీఘ విచారమును కొన్నిసమయములందు మరణమును కూడ పొందుచున్నారు.కొందరు సిద్ధాంతులు రోగాదికము వచ్చినని చెప్పినమాటలునమ్మి రోగములు వచ్చినప్పడు బాధపడుటకు మారుగా రానిరోగములనిమిత్తము మనోవ్యధచెంది వానిని తప్పించుకొనుటకయి తమవిత్తమును వంచకులపాలు చేయుచున్నారు.శిశువులు పుట్టిననక్షత్రములనుబట్టి సిద్ధాంతులు చెప్పిన మాతృగండములను పితృగండములను మాతులగండములను భ్రాతృగండములను విశ్వసించి శిశుహత్యలను గూడ జేయించుచున్నారు.అనేకులు సిద్ధాంతులు చెప్పినయెగములు నమ్ముకొని దుర్భరమలు పడి కాలము వ్యధపుచ్చి తుద కాశాభంగము పొంది వ్యాకులపడుచున్నారు.ఒకజ్యోతిష్కుడు మనయూరిలో నొక కాపువానివద్ద ధనము స్వీకరించి వానికి తోటలో చెట్టుమొదలు పాతు దొరకునని చెప్పగా వాడొకటితరవాత నొకటిగా చెట్లమొదళ్ళెల్లను త్రవ్వి యెందున ధననిక్షేపమును గానక చెట్లు చచ్చుటచేత దరిద్రుడయి మున్నున్నది సహితము పోగొట్టుకొని కలకాలము దు:ఖపడవలసిన వాడయ్యెను.ఇట్ల్నేకనిదర్శనములు కనబడు చున్నను