Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

యుపన్యాసము లిచ్చినను, ఎవ్వరును నమ్మరు. జ్యొతిశాస్త్రములో చెప్పినట్టు సంతానము కలుగుచుండలేదా?కలిగిన సంతానమునకు విద్యాబుద్దులు వచ్చుచుండలేదా?

ఉప -మీరూ సంతానమనుచున్నారుగనుక చెప్పెడనువినుఁడి. మాపెద్దన్నగారి జన్మపత్రములో నాతని కాఱగురు పుత్రులు కలు గునట్లున్నది;ఆయన భార్య జన్మపత్రములో నిద్దఱు కొడుకులును ముగ్గుఱు కూఁతులును కలుగునట్లునాది.ఆయన వృద్ధుఁదయినను భార్యకు ముట్లుడిగినను వారి కీవఱకును పంతానయోగ్యత కలుగు చిహ్నములేవియుఁ గానరాకున్నవి.ఈప్రకారముగానే నామిత్రుల జన్మపత్రముల ననేకములను శోధించి చూడఁగా సంతానవిషయమున వానీలోఁజెప్పఁబడినదానికిని సరిగా జరిగినదానికిని మిక్కిలి వ్యత్యా సము కనఁబడుచున్నది.ఇఁక విద్యావిషయ మన్ననో యంతకంటెను తాఱుమాఱుగా నున్నది.ఈవఱకు నేను జెప్పినప్రకారముగా నాచిన్న న్నగారికుమానుఁడును పాలికాఁవువాని కుమారుఁడును నరిగా నేక లగ్నమందును, ఏకముహూత౯మునందును,ఏతారయందును,పుట్టిన వారయినను మాయన్నగారి కుమారుఁడు పండితుఁ డగుటయు పాలికాఁపువాని కుమారుఁడు నిరక్షరకుక్షి యగుటయు మీరందఱు నెఱుఁగుదురు.దీనికి మీరేమి సమాధానము చెప్పఁగలరు?ఇదంతయు నేల? మనకు సమీపమునందే హీరణ్యాక్షద్వీప మున్నదిగదా? అక్కడ వసించువారందఱును మూఢులయి మరుష్యభక్షకులయి యనాగరికులుగా నున్నారు. అక్కడివా రనేకులు విద్వాంసులు కావల సీనముహూత౯ములలోఁ బుట్టినను వారిలో నొక్కరికిని విద్యయన్న వాసనయే లేక యందఱును జ్ఞానశూన్యులుగా నున్నారు.నేనీపని నిమిత్తమయి యక్కడకుఁ బోయి యనేకులజన్మపత్రములను వ్రాసికొని వచ్చి చూచునాను.చేతనైనపక్షమున నీవై పరీత్యమునకు కారణ మేమో జ్యొతిఘ్కులను చెప్పమనుఁడు.