పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/397

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లంకద్వీపము
                      387

జనులు తమమూఢ విశ్వాసమును విడువజాలక సూర్యచంద్రాదిజడ పదార్ధములవలన దెలిసికొని ఫలములను జెప్పదు మన్న మహాత్ములకు బానిసలయి బుద్దిపూర్యకముగా కష్టములకు తలయొగ్గుచున్నారు. మనమనసువచ్చినప్పడు కన్నబిడ్డకు పేరుపెట్టుకొనుటకును,క్రొత్త తలగుడ్డ ధరించుకొనుటను, క్రొత్తనగ పెట్టుకొనుటకును పొలమును దున్నుకొనుటకును విత్తనములు చల్లుకొనుటకును , పండిన పంట కోసికొనుటకును , గుర్రమునో గోవునో కొనుటకును , మందు పుచ్చుకొనుటకును, ప్రభుదర్శనము చేయుటకును విజ్ఞాపనపత్రికను పంపుకొనుటకును , ఇటువంటి మరియేయల్పకార్యమును చేయుటకును కూడ స్వతంత్రులముకాక మనము సమస్తమునకును, మింటనుండు గోళాకారము గల నోరులేని జడపదార్ధములు చెప్పనట్లే నడుచుకోవసినయెడల లోకములో నింతకంటె బానిసతనము మరియె ముండును? ఓయగ్రాసనాసీనా !ఇది మనము కోరి తెచ్చుకున్న బానిసతన మగునో కాదో నీవు చెప్పము.దురభిమానముచేత మావారు తెలిసియు