పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

మునందు బయలుదేఱి దేవతాదర్శనమునకు వెళ్ళి పూజారులు దేవా లయముయొక్కతలుపులు తీయకపోఁగా దేవతాదర్శనము చేయకయే యెండలో మరల నింటికి రావలసినవాఁడనయినాను .

బృహస్పతికాలమనఁగా నేమో మనభరతఖండవాసులకు తెలి యకపోవచ్చును. లంకలోఁ బుట్టినవారెల్ల రునురాక్షసులగుట చేత రాక్ష సుఁడైన రాహుగ్రహము వారికి శుభగ్రాహము; దేవతా గురువగు టచేత బృహస్పతి వారికి పాపగ్రహము.ఈదేశమునందు మనము రాహు కాల మశుభసూచకమని యెట్లెంతుమో యట్లె యాదేశమునందు వారు ప్రతిదినమును తొమ్మిదిగడియకాలమును బృహస్పతికాల మని చెప్పి యాకాల మశుభసూచకముగా పరిగణించి యేకార్యమును జేయక విడుతురు.

ఉప----వేఁడియెండ కాచినప్పుడు క్ష్ణములయిన సూర్యకిరణ ములచేత నేయిమొదలయినవి కరఁగునట్లును మనదేహములకు తాప మొక్కువట్లును మొత్తముమీఁద చంద్రాదిగ్రహములు పదాధకాము లకు కొన్నిమార్పులను గలుగఁజేయుఁ గలుగును;గాని యొకపదా ధ౯మున కొకవిధముగాను మఱియొకపదాధ౯మునకు మఱియొకవిధ ముగాను మార్పులను గలుగఁజేయఁజాలవు.ఎండలోఁబెట్టినప్పు డన్ని గిన్నెలలోని నేయి కరుఁగవలసినదే కాని యొకగిన్నె లోనినేయి కరఁ గుటయు, నొకగిన్నెలోనినేయి కరగక పోవుటయు తటస్థింపదు. చంద్రోదయాదులనుబట్టి. పోటో పోటో సమస్త సముద్ర్రములకును నేకరితీగాకలుగునేకానిచంద్రోదయముచేతనొక సముద్రమునకు పోటును మఱియొకసముద్రమునకు పాటును గలుగవు.ఆవిధముగానే గ్రహ గతుల వలనను గ్రహస్థితులవలనను ఫలము గలిగెడుపక్షమున సమస్త జనులకు నేకఫలము కలుగలెనేకాని వివిధజనులుకు వివిధఫలములు కలుగుట యెన్నఁడును తటస్థింప నేరదు.కాఁబట్టి వివిధజనులకు వివిధ