పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లం కా ద్వీ ప ము

ఫలముల నిచ్చుననిచెప్పెడు జ్యొతిశ్శాస్త్రము విశ్వాసార్హమయినది కాదు.బృహస్పతికాలమునందు వెళ్ళినవారికి కొందఱికి దైవికముగా కొన్ని సమయములయందు కార్యవిఘాతము కలిగినను కొందఱికి కొన్ని సమయములయందు కార్యసిద్ధి యగుటయుఁగలదు.నేననేక పర్యాయములు బృహస్పతికాలములో బయలుదేఱినను నాకు కార్య సిద్ధి యగుచునే వచ్చినది కాఁబట్టి కార్యసాఫల్యమునకుఁగాని కార్య వైఫల్యమునకుఁగాని, బృహస్పతికాలాదులు కారణములు కావు. కొన్ని కాలములు మంచివని కొన్ని కాలములు మంచివికావనిభావించి యుక్తకాలమునఁబనికి బూనక వృదా కాలహరణమును జేసెడు మౌఢ్యమునుబట్టి పెక్కుకార్యములు చెడుచున్నవి.ప్రతిసంవత్సర మునుశూన్యమాసములని కొన్ని మాసములు వ్యధ౯పరువఁబడు చున్నవి; మిగిలినమాసములలో శుభదినములు కావని కొన్ని దిన ములు వ్యధ౯పఱపఁ బడుచున్నవి.శేషించిన తిధులలో మంచివార ములు కావాని కొన్నివారములు వ్యధ౯పఱుపఁబడుచున్నవి;ఆ యు న్న కొన్ని వారములలో సహితము దుర్ముహూత౯మని,వజ౯సమయ మని,బృహస్పతికాలమని,నక్షత్రము మంచిదికాదని,విశేషకాలము వ్యధ౯పఱుపఁబడు చున్నది.ఈప్రకారముగా మూఢవిశ్వాసము చేత మంచి కాలమును వృధాగా పోఁగొట్టక యనుకూలకాలము నందెల్లను పనులు చేయుచువచ్చినచో దేశమున కెంతక్షేమము కలుగును?

వృశ్ఛి---ఇది యంతయు శాస్త్రదూషణము శాస్త్రనిందచేత నెంతయైనపాపమున్నది.ఏమయ్యా?వాలఖల్యా!అగ్రాసనాధిప త్యము వహించి శాస్త్రతిరస్కారము జరుగుచుండఁగా చూచుచు నూరకున్ననేమి?