పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము


రాక తప్పిపోయినట్టు మీరు సెలవిచ్చుచున్నారు.శాస్త్రమే నిజముయి దానివలన తప్పక రోగము రావలసియుండింనపక్షమున రోగము వచ్చి తీఱవలెనుగదా?గ్రహశాంతికయి సంతర్పణములు సమారా ధనములు చేయుటవలన రావలసినయపాయము తప్పననుట జ్యోతి ఘ్కలును పురోహితులును చేరి స్వోదరపూణా౯ర్ధమయి వన్నిన మాయోపాయము.నిజముగా రోగము వచ్చిన పక్షమున, గ్రహచా రము తిన్నగాలేక శాస్త్ర ప్రకారము వచ్చినదందురు. రోగము రాక పోయినపక్షమున,నవగ్రహజపాదులవలనను సంతర్పణములవలనను తప్పిపోయిన దందురు.ఈకపటోపాయమువలనజ్యొతిఘ్కలు చెప్పిన ఫలము తప్పిపోయినయెడల తమమీఁద నిందలేకుండ తప్పించుకొను టకును,పురోహితులు మొదలయినవారి కందఱికి సుదరపోషణము జరుగుటకును మాగ౯ము కలుగుచున్నది.అంతేకాక యాకాశమం దలి యచేతనములెన గ్రహము లెక్కడ?సచేతనులెన జీవులకు ఫల ములిచ్చు టెక్కడ?

మహా---మీకుయుక్తు లెంతమాత్రమును విశ్వాసార్హమయి నవి కావు.గ్రహములు జీవకొట్లకు తప్పక ఫలములిచ్చును.గ్రహము లకును మనకును సంబఁధము కలదనుటకు మీకు నేను కొన్ని ప్రత్యక్ష నిదర్శనములు చూపెదను.చంద్రోదయాస్తమానములను బట్టి సముద్రమునకు పోటును పాటును వచ్చుచుండుట మనకు ప్రత్య క్షమేకదా?దీనికి మీరేమి చెప్పఁగలరు?ఆదిగాక పూణి౯మ మొ దలయిన పర్వదినములయందు వెఱి మొదలయినరోగములు ప్రబలు చుండుట యనుభవసిద్ధిము.గ్రహములకే మనరోగాదికమునువృద్ధి చేయుట మొదలైన శక్తులు లేకపోయిన పక్షమున,అట్లేల జరుగును. దుర్ముహుత౯మునం దారంభించిన పనులు చెడుట నేను స్వాసుభ వముచేత నెఱుగుదును.నేను కొన్ని దినములక్రిందట బృహస్పతికాల