సత్యరాజా పూర్వదేశయాత్రలు
చెల్లెలు వై ధవ్యముఖ మనుభవింపవలసినదైనది . ఈ సిద్ధాంతి చెప్పిన మహూత౯మునందు కట్టించి ,పెట్టిన సుముహూత౯మునందు గృహప్రవేశమయిన మాపొరుగువారు నెలదినములలోపల గృహయజమానుఁడు స్వర్గస్తుఁడుకాఁగా తా మారుమానము లిల్లుపాడుపఱచి పొరుగువారివంచను జేరవలసినవారైరి . నామిత్రుని తండ్రి యొన్నియోదినములాగి యీ సిద్ధాంతిచెప్పినముహూత౯మునందు గ్రామాంతరమునకు బయలుదేరఱినను త్రోవలో దొంగలు కొట్టగా బండివిఱుఁగబడి కాలువిఱుగఁగొట్టుకొని యధ౯రాత్రమునందుమరల స్వగృహమును జేరవలసినవాఁడయినాఁడు .
వృశ్చి౼అయ్యలారా ! చిత్తగించినారా ? ఈయన నన్నెట్లు దూషించుచున్నాడో ! మూర్ఖపదము ప్రయో గించినప్పటికన్నను , ఈ దూషణభాషణము లధికర్ణకఠోరములుగా నున్నవి . పెద్దమనుష్యులింతమందియుండి పండితదూషణ జరుగుచుండగా చూచి యూరకుండుట మీకు ధర్మమా ! వారిగ్రహచారము చాలక యాపదలు తటస్ధమయినప్పుడు నేనేమిచేయగలను ? ముహూత౯ములు పెట్టుట నాపనికాని యాపదలు తప్పించుట నాపనికాదుకదా ?
త్రిశి౼ మీరు మంచిముహూత౯ములు పెట్టుటచేత విపత్తులు తిలఁగనిపక్షమున మీముహూత౯ములతో నేమిప్రయోజనము ?
మహా-మధ్య మీరు మాటాడుట యుక్తముకాదు . సామాన్యముగా జెప్పక వక్కాణించి యొక్కరిగూర్చి చెప్పుటయుపన్యాసకునికి మంచిపనికాదు . జ్యోతిషమువలన లాభమే లేకపోయిన పక్షమున నింతకాలమునుండి సర్వజ్ఞలయిన మనపెద్దలందఱును జన్మశత్రములు వ్రాయించుకొని సమస్త కార్యములను శుభముహూత౯ములు పెట్టించుకొనుచుందురా ? వ్యవహారదక్షులయిన ప్రభుత్వమువారు వ్యవహార నిమిత్తము జ్యోతిషవిద్వాంసులను నియమించుచుందురా ?