పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

</poem>లంకాద్వీపము

యందేతల గొఱిగించుకోవలసిన వార మగుచున్నాము . మనము క్రొత్తబట్టను కట్టుకోదలచినచో కావలసినప్పుడు కట్టుకొనక మూర్ఖసిద్ధాంతి తెలిపిన దినమును వారమును వచ్చువఱకును వేచియుండ వలసినవార మగుచున్నాము . వేయేల ? మనము క్రొత్తగా భార్యవద్ద పరుండ దలచుకొన్నను , గృహమునఁ ప్రవేసింప దలచుకొన్నను , రోగమునకు మందు పుచ్చుకోదలచియున్నను , మూర్ఖసిద్ధంతియే మనకు కాలని౯యము చేయవలెను . ఇట్టి నిత్యకృత్యములలోనే మనకు స్వాతంత్ర్యము లేనిచో లోకములో నింతకంటె క్రూరదాస్యము మఱియేముండును  ? మూర్ఖసిద్ధంతి౼:

వృచ్చికరోముడు౼మీరు మూర్ఖసిద్ధాంతియని లోకోపకారులయి మహావిద్వాంసులయిన జ్యోతిష్కులను నిర్హేతుకముగా దూషించి మహాదోషము కట్టుకొనుచున్నారు . ఈసిద్ధాంలే యుండి వివాహాదికార్యములందు మంచిముహూత౯ములుపెట్టి లోకమునకుపకారము చేయనిచో లోకమెట్టి దురవస్థల పాలగునో౼ ఉప౼మీరుపన్యాసమధ్యమున మాటాడరాదు౼

మహాకాయుఁడు౼మీరు సిద్ధాంతులను మూర్ఖులని దూషింప రాదు .

త్రిశురుఁడు౼మీరిఁకముందు సిద్ధాంతికిముందు మూర్ఖశబ్దము పెట్టక మాటాడుఁడు .

ఉప౼సిద్ధాంతులు లోకమునకు జేయుచున్న యుపకారము చెప్పనక్కర్లేదు . లోకములోనున్న జాతకపత్రికలో నెల్ల నుత్తమమైనదిని చెప్పి యొకవరుని నిణ౯యించి మంచిముహూత౯ము పెట్టి వివాహము చేయించి యీ సిద్ధాంతి మంచిదోవతులచావు కట్టుకొని పోయిన మూఁడుమాసములు పదిదినములలో జాతక పత్రికలలోని నూఱేండ్లు ముహూత౯బలముచేత నూఱు దినములుగా మాఱఁగా.<poem>