పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/387

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము


త్రిశి౼వీరి వ్యహార నిణ౯యమునందలి సత్యము మొన్ననేకదా సభలో బయలఁబడినది  ? కల్ప వృక్షమువలె పండితులయిదుగురుచేరి సభలోఁగూరుచుండి నేను గొనిపోయిన నగలపెట్టెను ధూమ్రా క్షుఁడు దొంగిలినట్లు సిద్దాంతముచేసినారు .

మహా౼అదియంతయు మోసము . నిజమైన వ్యవహారములో నిజము తెలియును గాని పరీక్షింపవలెనని మోసముచేసిన వ్యవహారములో సత్యమెట్లు బయలఁబడిను  ?

ఉప౼నాయుపన్యాసము ముగియనియ్యరా  ?

మహా౼ కానిండి .

ఉప౼లోకమునకుఁ గలిగెడియుపకారము లోకములోనివారైన యీసిద్ధాంతులకేగాని యితరలోకమున కణుమాత్రము గలు గదు .మనయింట కన్య రజస్వలయైనచో శాంతికావలేనో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ధాంతిగారికి దక్షిణముట్టవలెను: మనయింట నెవ్వరయిన పుట్టినపక్షమున పిత్రుగండమున్నదో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ద్గాంతిగారికి దక్షిణముట్టవలెను . ఈ ప్రకారముగా పుట్టినది మొదలుకొని చఛ్ఛువఱకును చెవులు కుట్టినను , పుట్టువెండ్రుకలు తీయించినను అన్నము ముట్టించినను , చదువవేసినను ,మఱయేపనిచేసినను సిద్ధాంతిగారిచేతను ముహూత౯ము పెట్టించుకొని యాయనకు ముట్టవలసినముడుపునెప్పుడో యొకప్పుడు చెల్లింపక తప్పదూ

మహా౼మీరుసిద్ధాంతులను వారివృత్తిని నిందింపఁగూడదు . వారు జనులకు ఫలములు చెప్పియు ముహూత౯ములు పెట్టీయు పడిన ప్రయాసమునకు ప్రతిఫలముగా ధనస్వీకారము చేయుచున్నారు .కాని