Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మిణి, తఱుచుగా స్నానము చేయుమనదికాచుగాన లోఁతు నీళ్ళలోనికి వెళ్ళుటకుభయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలి లోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితోతలమీఁద నీళ్ళు పోసికొనుచుందెను. అప్పుడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమిత్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్ట కొంగుతో తలతుడుచుకొని, శిరోజముల చివర ముడి చైచుకొని గట్టువంకఁ జూచి దూరము నుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేఱీ, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నిళ్ళు చెంఋమీఁద పోసి తీసికొని ,రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని , బట్టతిన్నగా సవరించుకొని, ఉతికినబట్టలను బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁగూడ గృహమునకు బోవ బయలుదేఱెను.