పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట - గృహవర్ణనము - రాజశేఖరుఁడుగారు వచ్చి కచేరిచావడిలోఁ గూర్చుండుట - బందుదర్శనము - స్వహస్తపాకియైన వైశ్వదేవపరుడు.

సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడి చేతి వంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పువైపు సందు లోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుకకు తిరిగి రెండుమాఱులు మెల్లగాదగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి ' అమ్మాయీ! నేనుందునా?' అని వెనుక తిరిగి పలికెను.

రుక్మి-'మంచిది. సోమిదేవమ్మగారూ! నా కొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?'

సోమి -ఎంతచుట్టు?నిమిషములో వెళ్ళెదను.

రుక్మి- 'పోయిరండీ

సోమి- బీదవాండ్రము మా మీఁద దయయుంచవనుజుండీ.

రుక్మి- 'దానికేమి? వెళ్ళిరండీ' అని నాలుగడుగులు నడిచి మరల వెనుక తిరిగి ' సోమిదేవమ్మగారు ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్కపర్యాయము వచ్చెదరుకాదా?'

సోమి- అవశ్యము, ఆలాగుననే వచ్చెదను. నేను పోయివస్తునా?

అని సోమిదేవమ్మ నదచినది. సిద్ధాంతిగారు గాని ఆయన పెద్దలుగాని యెప్పుడును యజ్ఞము చేసినవారు కాకపోయినను , సోమి