పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుడు - "రుక్మిణమ్మగారూ! సంకల్పముచెప్పెదను స్నానము చేయండి"

రుక్మి - ' నేను డబ్బు తీసుకొనిరాలేదే'

బ్రా - డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగానిలెండి; (అనివంగినిలుచుండి) ఆచమనము చేయండి.కేశవా-నారాయణా-మాధవా-గోవిందా-తూర్పుమొగముగా తిరుగుండి.సూర్యునికేసి.

రుక్మి - స్నానము చేయవలెనా?

బ్రా - 'సంకల్పముచెప్పనిండీ' అని పొడుముబుఱ్ఱను రొంటి నుండి తీసి, మూతతీసి రెండుమాఱులు నేలమెద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూతవేసి కాయను రొండిని దోవతిలో దోపుకొని యెడమచేతిలో నున్న పొడుమును బొటనవ్రేలితోను చూపుడు వ్రేలితోను పట్టగలిగి నంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలినదానిని రెండవపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కట్టుకొన్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, 'శుభేశోభనముహూర్తే శ్రీమహావిష్ణువరాజ్ఞయ - ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణ: - ద్వితీయ ప్రహరాధెన్ - శ్వేతవరాహకల్పే - వై వస్వతమన్వంతరే - కలియుగే - ప్రథమపాదే - జంబూద్వీపే - భరతవర్షే - భరతఖండే - అస్మిన్‌వతన్‌మానే వ్యావహారిక చాంద్రమానేన - కాళయుక్తి నామసంవత్సరే - దక్షిణాయనే - శరదృతౌ - కాతిన్‌కమాసే - కృష్ణపక్షే - ద్వాదశ్యాం - ఇందువాసరే - శుభనక్షత్ర శుభయోగ శుభకరణాద్యనేకగుణ విశిష్టాయా మాస్యాంశుభతిధౌ - క్షేమస్తైర్యవిజయాయురారోగ్యైవ్శ్వర్యాభి వృద్ధ్యధన్‌ం - అఖండగౌతమీస్నానమహం కరిష్యే - మూడుమాఱులు స్నానము చేయుండి".