పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

నకు యాత్రవెడలిరి. తరువాత సస్తసన్నాహములతోను శివుడు వచ్చి త్రిపురములను గానుక తనదివ్యదృష్టిచేత సిది యంతము శుక్రాచార్యుల కృత్యమని తెలిసికొని జ్యోతిషమెల్లప్పుడును యధాథా౯ము కాకపోవును గాకయని శపించెను. దీనిమర్మమిది.
 సత్య-- నేను ధన్యుఁడనయినాను. తమరు మర్మము విడిచి యీ రహస్యము నాకానతిచ్చినందున, సెలవయినపక్ష్మున నాకు తెలిసిన రహస్యమును నొకదానిని దేవర వారితో మనవిచేసేదను. జ్యోతిషమునకు పార్వతీశాపమున్న మాట మీపురాణ్ములయం వెచ్చటనైనఁ జూచియున్నారా?

మహా-- లేదు. జ్యోతిశ్శస్త్రమున కొక్క యీశ్వర శాపమే గాక పార్వతీ శాపము కూడ నున్నదా? ఏమి ఈ వింత:

సత్య-- లేదు. జ్యోతిశ్శాస్త్రము సందిగ్ధస్థలముల నిచ్చుటకు ముఖ్య కారణము పార్వతీశాపమే. పూర్వము సాంబశివులవారుం సభలోఁగూరుచుండి జ్యోతిశ్శాస్త్రముయొక్క సత్యమును పరిక్షించ వలెననియెంచి బృహస్పతిని జూచి యిప్పుడు పార్వతీదేవి యేమి చేయుచున్నదో చెప్పుమని యడిగెను. ఆతడు శాస్త్రదృష్టిచేతఁ జూచి బార్వతిదేవి వస్త్రహీనమై యభ్యంఙన స్నానము చేయుచున్నదని చెప్పెను. ఆవాక్యము యొక్క యధాధ౯తను కన్నులార చూడవలెనని శివుడుతక్షణమే కొలువు విడిచి లేచి తిన్నగా నంతఃపురమునకుఁబోయి నలుగుపిడితోఁజేసి ప్రాణప్రతిష్ఠ చేసి కావలియుంచిన విఘ్నేశ్వరుఁడు లోపలికి పోనీకపోఁగా నతని శిరస్సు ఖండించి పోయి చూచి జ్యోతిశ్శాస్త్రముయోక్క సత్యమున కత్యాశ్చర్యపడెను. జ్యోతిశ్శాస్త్రమువలన స్త్రీలగుట్టు మగవారీకి తెలిసిపోవుచున్నదిగదా యని పార్వతీదేవి యాగ్రహముతో జ్యోతిశ్శాస్త్రము ఫలింపక పోవును గాక యని ఘోరశాపమిచ్చెను. జ్యోతిష్కులు చెప్పిన ఫలము తప్పిపోవుట కీశాపములే కారణములుగాని శాస్త్రమెంత మాత్రము నబ్ధముకాదు