పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహా-- దేవతలందఱును మదుర్మాగులు. అందులోను దేవగురువైన బృహస్పతి పరమదుర్మాగుడు. కాకపోయినపక్షము నమూల్యమైన జ్యోతిశ్శాస్త్రమునకు నిష్కారణముగా శాపము తెచ్చి పెట్టునా? ఇటువంటి దుష్కార్యమును జేసినందుకు మారావణమహారాజు గారు లేకపోఁబట్టి బ్రతికిపోయినాఁడు. పాపి చిరాయు వనుట చేత నెల్ల కాలము నాతనినే బ్రతుకనిమ్ము. సత్యమిప్పుడు నాకు పూణ౯ముగా భోధిపడినది. జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేస్వరులిద్దరు శాపములు పెట్టిన తరువాత సిద్ధాంతులు చెప్పినఫలము తప్పిపోవుటలో నాశ్చర్య మేమున్నది? సిద్ధాంతులు లంచములు పుచ్చుకొని తప్పుఫలములను చెప్పుదురందురుగాని చెప్పినఫలములు తప్పిపోవుటకు లంచము లక్కఱలేక యీశాపములే చాలును.

ఇంతవరకు సంభాషణ జరుగునప్పటికి నాపూజాసమయమును భక్తులు దర్శింపవచ్చు సమయమును సమీపించినందున నాయర్చకులురాఁగా మహాకాయుఁడుగారు నన్ను విడిచి లోపలికిఁ బోయిరి. అంతట నేనీవరకు వణి౯ంచినప్రకారముగా నానిత్యకృతుత్యము యధావిధిగా జరుగ నారంభించెను.

                             --------------------------------

అయిదవ ప్రకరణము.

సభాసందర్శనము చేసి వచ్చిన తరువాత మూఁడవనాఁడు మధ్యాహ్నము మూఁడు గంటలవేళ మహాకాయుఁడు గారు వచ్చి, నేఁడు జ్యోతిశ్శాస్త్రమును గూర్చి సభ జరుగఁబోవుచున్నది గనుక తనవెంటఁజూడ రమ్మని నన్ను పిలిచిరి. మొన్నబండిలో తగిలిన కుదుపువలన గలిగిన నొప్పులింకను తిన్నగా పోకపోయినను, ఆయన మాటకు మాఱు