పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

విడిచి సిద్ధాంతులు చెప్పు ఫలములలో వ్యత్యాసము కలుగుటకుఁగల నిజమయిన కారణము తెలిపెదను. నీవిధి విశ్వాసహీనులతోఁ జెప్పక మహా రహస్యముగా నుంచవలెను. ఇట్టి ఙానదానమున కెల్ల వారును నర్హులుకారు సుమా!

సత్య-- తమరు సెలవిచ్చినది పరమసత్యము. ఙానోపదేశమునకందఱును యోగ్యులుకారు. నేను యోగ్యుఁడనని తమచిత్తమునకు తోఁచిన పక్షమున--
 
   
మహ-- నీయోగ్యతావిషయమై మాకణుమాత్రమును సదేహములేదు. జ్యొతిషము తప్పిపొవుటకు నిజమైన కారణము పరమేశ్వరశాపము. నీవు భక్తగ్రేసరుఁడగుటచేత పరమరహస్యమైనను దాచక నీకిది నేను సమర్మకముగా నుపదేశించినాను. నీవిది భక్తిహీనులకెప్పుడును చెవిని వేయఁగూడదు. ఇప్పుడు నీకు తృప్తికలిగినదా?

సత్య-- నిజమైనకారణమును గ్రహించుటచేత నే నిప్పుడు పరమసంతుష్ణాంతరంగుడ నయినాను. ఇది యత్యంతగుహ్యమైన పరమ రహస్య మనుటకు సందేహములేదు. ఇది దేవరహస్యమే కాకపోయిన పక్షమున, పురాణములనురచించిన మాదేములోని సర్వఙలయిన మహర్హులకొక్కరికైన దెలిసియుండకపోవునా? నేను మాదేశము చేరిన తోడనే దీనిని పద్మపురానముయొక్క యుత్తరభాగమములోని యష్టోత్తర శతసహస్రాధ్యాయమునందుఁ జేర్చి వ్యాసప్రోక్తము చేయించెదను. తమరీ శాపకారణము నామూలాగ్రముగా సెలవియ్యవలెను.

మహా-- పూర్వకాలమునందు శ్రీసాంబమూర్తివారు త్రిపుకాసుర సంహారము చేయఁ బూని యుద్ధ సన్నద్ధులయినయున్నప్పుడు ముందుగా శుక్రాచార్యులవారావృత్తాంతమును తమ జ్యోతిశ్శాస్త్రమహిమచేఁ దెలిసికొని శిష్యులకు తెలుపగా, వారు శివుఁడు వచ్చులోపల తమ పురములతో పాతాళలోకము