పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లంకాద్వీపము

ము చేఁ గోరఁగా వెనుకఁ చెప్పినప్రకారముగానే సిద్ధాంతులు యధా విధిగా చేయవలసిన తంతునంతను నడపి యాలోచించి యీసారి యభి ప్ర్రాయభేదము లేకుండ పారాంశముల మూఁటిని శాస్త్ర దృష్టితో సావధానముగాఁజూచి యేకవాక్యముగా సిద్దాంతీకరించి సత్యమును తేల్చిరి. ధూమ్రాక్షఁడేయనియు, ఇతఁడాపెట్టెను తానుంచుకొన్న వేశ్యకీయ్యగా నావేశ్యయాపెట్టెను తానుణ్చుకొన్నవిలపురుషుని చేతి కిచ్చియిల్లు దాటించె ననియు, వారేర్పఱచిన నిష్కృష్టాశయమును లేఖఁకుడు వ్రాసి ధర్మాధికారి చేతికిచ్చెను. అదిచూచుకొని ధర్మాధికారి యా కాశమువంకఁజూచి కొంతనే పాలోచించి, రాజబంధుని నిఅచతస్కరునివలె చెఱపాలకుఁ