పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/376

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

యు జ్యోతిష్కుల సిద్ధాంతనిర్ణయమును గూర్చియుమాటాడ నారంభించిరితిని. నాయజమానుఁడు కొంతసేపు తానావిషయమయి నాతో మాటాడుట కిష్టములేని వానివలెఁ గనబడినను నేను విడిచిపెట్టక వేసిన ప్రశ్ననే మరలవేయుచు వచ్చుటచేత తుదకిష్టములేకయే నాప్రశ్నలకుత్తరము చెప్పవలసినవాఁడయిననందున మాయిరువురకు నీక్రిందిరీతి సంభాషణము జరిగినది-.

సత్య- ఓమహప్రభూ! ఈజ్యోతిష్కుల వ్యవహరనిర్ణయ మెల్లప్పుడు నీప్రకారముగానే యుండునా? వేఱువిధముగా నుండునా?

మహ- ఎప్పుడు నిదేప్రకారముగా నుండును.

సత్య- ఏకశాస్త్రమువలననే సిద్ధాంతనిర్ణయము చేయవలసినప్పుడు వీరిలోవీరికభిప్రాయభేధము లేలకకుగును?
 మహా- శాస్త్రమొక్కటికాదు; శాస్త్రములనంతము.
  సత్య- శాస్త్రము లనంతములయినను,అన్నియునే కవిధముగా ఫలము జెప్పకపొయిన పక్షమున వానిలో కొన్ని యసత్యములు కావలసివచ్చును.

మహా- శాస్త్రము లసత్యము లెన్నిటికి8నిగావు. ఈభేధమునకుఁగారణము శాస్త్రార్ధముచేయువారి బుద్ధివిశేషములో నుండును. ఫలములను జెప్పువారు తమతమ బుద్ధ్యనుసారముగా నూహించి చెప్పుత వలన నిట్టి భిన్నాభిప్రాయములుకలుగుచుండును.

సత్య- నియమము లేక యెవరిబుద్ధికి తోఁచినట్టు వారర్ధము చేయుచువచ్చినచో శాస్త్రములవలన ప్రయోజమేమి?

మహా- శాస్త్రము లెవరిబుద్ధికి తోఁచినట్లు వారి కర్ధమిచ్చునవికావు. అవి యందరికి నేకార్ధమునే యిచ్చును. అయినను శాస్త్రార్ధ నిర్ణయముచేయువారు ముహూర్తము తిన్నగా కట్టలేక పోవుటవలనను గణప తిన్నగా చేయలేక పోవుటవలనను ఫలములోఁ గొన్ని వ్యత్యాసములు కలుగుచుండును.