పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశియాత్రలు

యితనియింటికిఁబోయినాను.అప్పుడితఁడింటలేఁడు.ఇల్లుశోధించినాముగానిపెట్టెదొరకలేదు.

ధర్మా-ఇతఁడింటికేరానప్పుడుపెట్టెయెట్లుదొరుకును?మీరుమొట్టమొదటవేశ్యయింటికిఁబోవలసినది.
దూష-ఆపనియుఁజేసినాము.పెట్టెకానియితడుకానియింటదొరకకపోవగామేమెక్కడనుండితిన్నగావేశ్యయింటికిఁబోయిదానియిల్లుశోధింపఁగానొకమూలగదిలోనితఁడుదొరెకెనుగానిపెట్టెమాత్రముదొరకలేదు.రాజభటులీతనినిపట్టుకొనిదేవరసన్నిధికిఁదెచ్చినారు.ఇతడునగలపెట్టెనుచంకక్రిందఁబెట్టుకొనిపరుగెత్తుచుండఁగామేమందఱమునుగన్నులారాఁజూచినాము.

ధర్మా- ధూమాక్షా!నీవేమిచెప్పుకొనెదవు?నీవురాజబంధుఁడవయ్యునునీదుష్పవత౯నముచేతబంధులమయినమాకందఱికినితలవంపులుతెచ్చుకొన్నావు.

ధూమా-నావెనుకటినడతనుబట్టినేనేమిచెప్పిననునామాటయెవ్వరునునమ్మరు.మొదటచిన్నదానినగయెత్తుకొనిపోయినమాటవాస్తవమేకానియీసారిమాత్రమునగలపెట్టనునేనుదొంగిలింపలేదు.నగలపెట్టెపోయినదన్నసమయముననేనువేశ్యయింటనేయున్నాను.

ధర్మా-జారచోరులమాటనమ్మరాదు.ఓవిద్వచ్చిఖాణులారా!నగలపెట్టెపోయినదోలేదో,మీరేశాస్త్రదృష్టిచేతఁజూచిసత్యముచెప్పుడు.

న్యాయస్థానమునకు వచ్చిన ప్రత్యభియోగమునందును మూడు సారాంశముల నేర్పఱుచుట యచ్చటి శాస్త్రమర్యాద.ధర్మాధికారి యీప్రకారముగా సారాంశముల నేర్పఱిచివ్యవహారనిణ౯య