పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>లంకా ద్వీపము

తీర్పఁబడిన తరువాత దొంగతనపు వ్వవహరము తీర్చుటకయి నేరము మోపినవానిని మోపఁబడినవానిని పిలిపింపుమని మరల ధర్మాధికారి లేఖకుని కుత్తరువు చేసెను. అంతట లేఖకుని యొక్క యాజ్ఞాప్రకారముగా రాజభటులు దూషణని ధూమ్రాకుని గొనివచ్చి ధర్మాధికారి యెదటనెలువఁబెట్టిరి.

ధర్మా౼ఓదూణా;నీవు తేచ్చిన యబియోగమేమి దూష౼ఈదూమక్షుఁడు మాబందువుగ౯ములోనివాడు. దుస్సహావాసము చేత నితఁడు చిన్ననాఁటినుండియు దుష్టనర్తనుఁడయి జూదములాడుచు పూర్వు లార్జించిన ధనవంతను పాడుచేసి విచ్చిలవిడిగాఁ దిరుగుచున్నాడు.ఇతఁడు తనతల్లిదండ్రులు విధ్యుక్తముగా వివాహము చేసిన భార్యను విడనాడి జారవృత్తి నవలఁబించి యొకవెశ్య నుంచుకొని యున్నాడు. విత్తము లేనిదే వేశ్యచిత్తమునులోఁగోనుట యొప్పుడును సంభవింప నేరదు గనుక, విత్తహీనుడుయినప్పుడు జారత్వమును చోరత్వ మనుసరించి యుండక మానదు. ఇతఁడు కొంతకాలము క్రిందట మాయింటికి చుట్టపుఁ జూపుగావచ్చి చావడిలో నాడుకొనుచున్న మాచిన్నదానినగయొకటి త్రెంపుకొనిపోయి వేశ్యకిచ్చినవాడు. రక్తస్పర్శ గలవాఁడగుటచేత మేమప్పుడితనిని రచ్చకీడ్వక చీవాటు పెట్టిక్షమించి యూరకున్నాము.నిన్నటి దినము మాఇంటికి మరల వచ్చి నాభార్యనగలపెట్టె యెత్తుకొనిపారిపోయినాడు. పిల్లది చూచి యరవగానే మేము వెంటబడితిమిగాని యితడు వీధిబడి యేదో సందులోదూకి యదృశ్యుడయినాడు.

ధర్మా:-- తరువార నగలపెట్టె దొరికినదా? దూవ:--దొరకలేదు. నేను వెంటనే రాజభటులను గొని