Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                  సత్యరాజా పుర్వదేశయాత్రలు;;

దికారిని లేపినపిమ్మట జ్యొతిష్కులు తమ సిద్ధాంతములను దెలిపిరి. వారిలో వృశ్చికరోముఁడును కంటకరోముఁడును జ్రహస్థుఁడనిచెప్పిరి.తక్కిన ముగ్గురును మొదటిప్రహస్థు;డే వజ్రహస్థుఁడఁరి. ఇఁక రెండవసార౦శము లో వృశ్చిక రోముఁడును కంటకరోముఁడును వజ్రహసుఁడును నేరముచేసినాఁడనిరి. అగ్ని రోముఁడును, సర్పరోముఁడును వజ్రహస్థుఁడు నేరము చేయలెదనియు నతనియందలి ద్వేషము చేత భార్య భత౯ లేకమయి యీదోషారోపణము చేసినారనియు పలికిరి. మూడవ సారంశమును గూర్చి యేవురు సిద్ధాంతములు నైకకంట్యముతో నామె నిజమయినకైకసి యనియే సిద్ధాంతముచేసిరి. అప్పుడు వాదిబంధువు లగ్నిరోమ సర్పరోములు వజ్రహస్థునివలన లంచముగొనిరని కేకలు వేయజోచ్చిరి; ప్రతిబంధువులు వృశ్చికరోమాదులు ప్రహస్థునివలన లంచములు గైకొనిరని కేకలు వేయ నారంభిచిరి. ధర్మాదికారి వారికలకలములువారించి సిద్ధాంతములలో నదిక సంఖ్యగలవారి యభిప్రాయను సారముగా వజ్రహస్థునికి రెండుసంవత్సరములు గృహవాసశిక్ష విదించినట్లు తీర్పువ్రాసి వినిపించెను. సిద్ధాంతుల యభిప్రాయము ననుసరించి తనకు శిక్షయగునని మొదటిప్రహస్థుఁడు వడవడ వడఁకుచు భూమిమీఁదఁబడి మూర్చపోయెను.అందఱును మూఁగిచన్నిళ్ళూ చల్లి యాతనిని మూర్చతేర్చునప్పుటి కా సందడిలో రెండోవ ప్రహస్థుఁడు కనఁబడక యదృశ్యుడయెను.అప్పుడా యంతాధా౯నము నొందివాఁడే నిజమయిన వజ్రహస్థుఁడని యెల్లవారికిని భోధపడెను. ధర్మాధికారి రాజభటులులను జూచి యీఁగయయి యతఁ డెగిరిపోయి యుండేను.పట్టుకొండెని రాజభటులు కాజౢపించెను. వారునానాముఖములు సరచుచు పరుగెత్తిరికాని వారికంటి కెవ్వరును నక్షత్రమండలము లోపలఁ గాన బడలేదు. ఈప్రకారముగా మొదటి వ్యవహరము