పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ల౦కాద్విపము

ధర్మా౼మీలో మీరు పొట్లడాక యూరకు౦డుఁడు.౼ఓవిద్వదగ్రగణ్యులారా¡మీరే యిప్పుడు శాస్త్రసిద్ధాతానుసారముగాధర్మనిర్నయము చెయవలెను. నిజముచెప్పక యి౦తసెపు మాకు నిష్కారణముగా నాయసము కలుగఁజెసినందునకయి యీసారీయపరాధికి మే మతిఘోరశిక్ష విది౦ఁదలఁచుకొన్నాము.మీరి యిప్పుడు సిద్ధా౦తీకరి౦పవలసిన య౦శములు౼౧.విరిలొ వజ్రహస్థుఁడెవఁడు‘౨.వజ్రహస్థుఁడు నేరము చెసినాఁడా,లెదా‽౩.ఈమె నిజమయిన కైకసి యగునా ¡ కాదా‽౼ముఖ్యముగా నీమూఁడ౦శములను మీర శాస్త్రపదతిని నిర్ధారణము చెయవలెను.

అని ఖరాసురుఁడు సెలవియ్యఁగానె సిద్ధా౦తు లాకాశమువ౦కఁ జుచియు వ్రేళ్ళు మడచియు నేల మీఁద స౦కెలు వేసియు ముకుపుటముల వ్రేళ్ళు చొనిపియు నొ౦డొరలతో గుసగుసలాడియు లెక్కలు వెసి తలపోఁతలకు జొచ్చిరి. ఈ లొపల ధర్మాధికారి పీటము మీదవెనుక కొఱిగి యొక్క కునుకుకునికెను. సభలో నిలచియున్నయుభయవాధుల పక్షులు వారును విధ్వా౦సు లేమిసెలవిత్తురొ యని విననుత్సుకులె వెచియు౦డిరి. చూడవచ్చినర౦దరఱూను వివిదవిషయములు గూర్చియ తమలోఁతము స౦భాషి౦చుకొనుచుండరి.ఈ ప్రకరముగా రెండుగడియులసేపు నడుచునప్పటీకి సిద్ధ్హాంతులలొ నొకరు లేఖకునిఁ బిలిచి తమ అభిప్రాయములను వ్రాయవలిసినదని చెప్పెను. మనదేశ౦నందు వలెనె యాదేశ౦మునందు విధ్వాంసులకు శాస్త్రజ్ఞానమె కాని యక్షరజ్ఞాన ముండదు.అందు చెతనె యాదేశమునందు వైయాకరణుఁడు తన చుట్టముల కుత్తరము వ్రాయవలసివచ్చినను లౌకికుల యొద్దకుబోయి వ్రాయించు కోవలిసినవాఁడె కాని స్వయముగా వ్రాసికోనేర్చినవాఁడు కాఁడు. ఆ సంగతి యటుండనిచ్చి కార్యంశము చిత్తగింపుడు. లెఖకుఁడు ధర్మా