పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       348 సత్యరాజాపూర్వదేశయాత్రలు
    లవలెనే ధనార్జనోపాయముల యందు మహాబుద్ధిమంతు లగుటచేట నాప్రసాదము సర్వాభీష్టప్రదమని ప్రశ్నలడుగ వచ్చిన వారితోఁజెప్పి యరఁటిపండ్లు మొదలయినవి విద్యచేత చెడిపోని భక్తులచేతులలోఁ బెట్టిధనాకర్షణము చేయుసాగిరి. ఇట్లుండగా నొకనాడుచేరువ పల్లెనుండి చాకలివాఁడొకఁడువచ్చి నాకు సాష్టాంగనమస్కారము చేసితప్పిపోయిన క్రొత్తగాకొన్న తనగాడిద కనఁబడునట్లనుగ్రహించవలసినదని ప్రార్ధించి దక్షిణయును పండ్లను పళ్ళెములోఁబెట్టి యర్చకులకు సమర్పించెను. ఆయర్చకులాదక్షిణను స్వీకరించి తిన్నగాపండని యరటిపండొకటి వానిచేతిలోఁబెట్టి యాదేవతా ప్రసాదమును దేవతా సన్నిధాననునందే పరిగ్రహించి మొక్కిపొమ్మని వానికాజ్ఞయిచ్చిరి. వాఁడాప్రకారముగా ప్రసాదముస్వీకరించిభక్షించి తనయూరికి పోవుచుండగా త్రోవలోనే యాప్రసాదము వరదానమయి, భక్తి పరిశోధనార్ధమయి వానికుడుపులో శూలమునుపుట్టించి విరేచనమిషమిఁద వానినిచెరువు గట్టు మిఁదకి పరుగెతించి యక్కడ తుమ్మచెట్టుక్రింద మేయుచున్న వాని గాడిదనుజూపెను. వాఁడునాప్రసాద మహిమకత్యద్భుతపడితన గాడిదను తిన్నగాతన యింటికిఁదోలు కోనిపోయి తనబంధూల కెల్లనుజూపి నామహిమలనుగాధలుగాపొగడెను.ఇట్లు నామహత్త్వములదేశమంతటనువ్యాపించినందున,గాడిదలు,గేదలు,ఆవులు,మొదలయినవితప్పిపోయినవారందరును, చుట్టుపట్ల గ్రామములనుండి ప్రసాద స్వీకారార్ధమయి నాదర్శనమునకు రాఁదొడఁగిరి.ఆమఱునాఁడే యాచాకలివాని గ్రామమునుండి తనగాడిద తప్పిపోయిన దని వాని చుట్టమొకఁడును,తనయేద్దూ తప్పిపోయిన డని కాపువాఁడొకఁడును రాగా,మాయర్చకులు వారివలన విధ్యుక్తములయిన దక్షిణలను గ్రహించి యరఁటిపండ్లు ప్రసాదమును వారిచేతిలోఁబెట్టి నాయెదుటనే వారిచేతఁదినిపించి పంపివేసిరి.అయి