పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                      లంకాద్వీపము 349
  నను చాకలివాని గాడిదగాని, కాఁపువాని యెద్దుగాని త్రోవలో వారికి కనఁబడలేదఁట. గాడిదమాత్రము మఱియెప్పుడును కనఁబడనే లేదఁటగాని తరువాత గొన్నిదినముల కెద్దు పొరుగూరి బందెల దొడ్డిలో నుండఁగాకాపువాఁడు బందెయిచ్చి దానినివదల్చి తెచ్చుకొనెనఁట. ఈవాతకా నాచెవిని బడఁగానే యొకరి విషయమున వెంటనే ఫలించిననాప్రసాద మింకొకరి విషయుములో నేలఫలింపక పోవలెననినాలో నేనాలోచించికోన మొదలుపెట్టితిని.తరువాత వచ్చినవారికి నాయెడల నిజమయిన భక్తిదేమెయని సంశయించి లేభక్తియే లేకపోయిన యెడల వారంతదూరము శ్రమపడివచ్చి భూరిదక్షిణలు సమర్పించుట తటస్ధీంపదుగాన వారి కార్యవైఫల్యమునకు భక్తిహినతకారణము కాదనినిశ్చియించి యావిషయమున వారిని నిర్దోషూలనుగా నిణయించినాను.భక్తిహినత కారణము కాకపోయి పక్షమున నాయమెఘప్రసాదము విఫలమగుట కేమికారణమై యుండునని నాలోనేను తలపోయుచు కన్నులు మూసికొని యీశ్వరాధ్యానము చేయుచుండగా మంత్రద్రష్టలైన మహషులకు వేదమంత్రములప్రత్యక్ష మయినట్టె నాకును స్వప్నములోఁగొనొయూహలు సాక్ష్కత్కారముకాఁగా,శాస్త్రజన్నముయెక్క క్రమమిట్టిదేకదా యాని తెలిసికొని తోడనే నొకయభినవశాస్త్ర నిర్మాణమున కారంభించినాము.మేలుకొన్నప్పుడును నిద్రపోవుచున్న ఇప్పుడును స్వప్నరూపమూనునీశ్వరా దేశముచేత సన్నిధి చేసినయూహలనుభట్టియు నాయనుదిన ప్రత్యక్షానిభవమును బట్టియు మూఁడుమాసములలో మహత్తరమయిన ప్రసాదజ్యౌతిశ్శాస్త్రము నొకదానిని సాంగోపాంగముగా సాంతముచేసితిని.ఆశాస్త్రమంతయు వినిపించినచో గురూపదేశము లేనివారికి దురవగాహ మగుటయాలోచించి పూర్వోక్తరహస్యలధమునుబట్టి మిరు గ్రహింపఁగలిగిన మూఁల సూత్రములను ముఖ్యముగా నిందుదాహరించుచున్నాను.