పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                           లంకాద్వీపము 347
       అను బృహజ్జాతక వచనమును బట్టి కుమారుఁడు కలుగునని చెప్పినారు. శాస్త్రము లెప్పుడు నబద్ధములు కావు గనుక వృద్ధాంగన యింటికిఁ బోయిన జాము లోపల కోడలికి నేను చెప్పినట్లు పురుషశిశువు కలిగెను. అక్కడి జ్యోతిష్కులు మాత్రము లెక్కవేసి తమ శాస్త్రప్రకారముగా తప్పుక స్త్రీ శిశువు కలుగునని చెప్పిరఁట. చూచినారా వారి శాస్త్రములకంటె మన శాస్త్రములయం దెంత యాధిక్యమున్నదో ఆవృద్ధాంగన నేను జెప్పిన సంగతి జ్యోతిష్కులకుఁజెప్పుఁ గానే వారందరూ నావద్దకు మహాకోపముతో పరుగెత్తుకొని వచ్చి నీవేశాస్త్రప్రకారముగాకొడుకు పుట్టునని చెప్పినావో చెప్పుమని పట్టుకొనిరి. వారిశాస్త్రములకు విరుద్ధముగానున్నందన శాస్త్ర ప్రమాణమును జెప్పిన స్వదేశాభిమానము చేత శాస్త్రబద్ధలయినవారు నాకేమి హాని చేయుదురో యని జడుసియ సత్యము పలుకుట కిష్టములేనివాఁడనయి వారిప్రశ్నల కుత్తరము చెప్పుక మౌనముధరించి యూరకుంటిని. అందచేత వారు నేఫలములను జ్యోతిశ్శాస్త్రము చేతఁగాక మునులకుఁగల యాంతరదృష్టి చేతనే చెప్పుతినని తమలోఁదాము సిద్ధాంతము చేసికొని యాసిద్ధాంతులు గ్రామములో నా దివ్యజ్ఞానమును గూర్చి గొప్పువారితో నెల్లఁబ్రశంసించిరి. అందు మీదనన్ను ప్రశ్నలడదగుటకయి గొప్పు వారందరును రా మొదలుపెట్టిరి. బుద్ధిమంతఁడను గనుకవాలో నేనాలోచించుకొని జ్యౌతిషభూమియైన యాదేసములో నేమియుతిరము చెప్పినజ్యోతిష్కుల వలన నేమి చిక్కువచ్చునోయని భయపడి యేమియు నుత్తంము చెప్పుక యెవ్వరే ప్రశ్నవేసినను తలయూచి యూరకుండచు వచ్చితిని. తరువాత నావద్దఁజేరిన జ్యోతిష్కులు తమశాస్త్రములనుబట్టి నాశిరఃకంపమున కర్ధముచేసి యడిగిన ప్రశ్నలకన్నిటికినుత్తరములు చెప్పి భక్తలను సమాధానపఱిచి పంపుచుచువచ్చిరి.

       నాయొద్దు నుంచఁబడిన యర్చకులు మన దేశములోని పూజారు