పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశయాత్రలు

త్రోవలోనే యెడమకాలు ముడుచుకొని కుడికాలొక్కటియే భూమి మీఁదఁ బెట్టినాను. హూణపంచాంగములు లేని యాదేశములో సంవత్సరమును మాసమును తిధియు సరిగా నెట్లు తెలిసికోఁగలిగితి వని సూక్ష్మబుద్ధి లేనివారు కొంద రడుగవచ్చును. ఆఁడుమళయాళ దేశములో మూఁడుసంవత్సరముల రెండుమాసములు పందోమ్మిది దినము లుండుటచేత దానిని బట్టి లెక్క వేసి చూడఁగా, నేనక్కడ ప్రవేశించిన దినము సరిగా నేనిప్పుడు చెప్పినదే యయినట్లు దేలినది. అంతేకాక లంకానగరము నందు జ్యోతిశ్శాస్త్ర విద్వాంసు లనేకు లున్నందన వారి నాశ్రయించి తరువాత కొంత కాలమునకు వారిచేత చేయించిన లెక్కను బట్టికూడ ర్వ్ండుమూడుదనము లెక్కువ తక్కువగా నేను జెప్పిన తిధిసరియైనట్టుసిద్ధాంతమయినది. ఆ రెండు మూడు దినములు వ్యత్యాసమును లంకాద్వీపమునకు మనదేశమునకుగల కాల వ్యత్యాసము లనను జ్యోతిశ్శాస్త్ర సిద్ధాంత భేదముల వలనను వచ్చినదగుట చేత మీ రాయల్ప భేదమును పాటింపక కర్మానష్ఠానమునకు నేను చెప్పిన దనమే సిద్ధాంతము చేసికొనుఁడు. శలివాహనశకాది హిందూశకమును న్నింటిని విడిచిపెట్టి హూణశకప్రకారముగా సంవత్సరపరిగణన మేలచేసితివని కొందఱుబిద్ధిమంతులు శంక చేయవచ్చును. దానికిని సమాదానము వినుఁడు. ఇప్పుడు మన భరత ఖండమునం దంతటను వ్యాపించియున్న యిగ్లీ షు పాఠశాలల మహత్త్వము వలన ముఖ్య పట్టణములయం దెల్లవారును తెలుఁగు సంవత్సరములును తెలుఁగుతిధులుగు మఱచి యున్నారనియు, ఇప్పు డించు మించుగా కలినిషిద్దముగానంగికరింపబడుచున్నసంధ్యావందనమును జేయుచాందసు లక్కడక్కడ ఁగొందఱన్నను వారుసహితము "అస్మిన్ వత్తమాన వ్యావహారిక హూణమానేన ౧౮౮౩ సంవత్సరే, మార్చిమాసే ౨౩తిధౌ"అని సంధ్యావందనములో నింగ్లీషు తిధు