పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ద్వితీయ భాగము

లంకాద్వీపము.


మొదటి ప్రకరణము.

ఆఁడుమళయాళములో నాకు సిద్ధుఁ డనుగ్రహింహిచిన పనరు యొక్క మహిమచేత నడవవలసిన ప్రయాసములేక మనోవేగమున గగన మార్గమునఁ బోయి క్షణకాలములో నేను లంకాద్వీపమున వాలితినని చెప్పియున్నానుగదా! హనుమద్దేవుని తరువాత నీకలికాలములో మన పెద్దలెవ్వరును పురాణములలోఁ దక్క దర్శింపనోచుకోని లంకా ద్వీపమును వాయుపధమునఁ బోయి చేరఁ గలుగుటకు మన భరతఖండవాసులలోనేల్ల నేనే ప్రధముఁడ నగుటచేత,ఇంతటి ఘనకార్యమును నిర్వహించిన యాయుత్తమోత్తమ దినమును మహాపుణ్య దినమునుగా భావించి యేటేల మీ రుత్సవముచేసికొనక మానరన్న దృఢవిశ్వాసమునుబట్టి నేనక్కడ నడుగిడినదినమును మీకు సరిగా తృటిలవలతో చెప్పుచున్నాను. సావధానచిత్తులరై గ్రహింపుడు.నే నాదేశములో కుడికాలు మోపిన పుణ్యకాలము హూణశకము ౧౮౮౩ వ సంవత్సరము మార్చి నెల ౨౩ వ తేదీ మధ్యాహ్నము మూఁడుగంటల రెండుమినిట్ల నాలుగు సెకన్లు ముప్పాతిక మీఁద మోఁడువీసములకాలము. నేనాదేశమునందు వాలెడునప్పుడు సహితము మనదేశమందలి కాలజ్నులు తప్పుపట్టులు కవకాశములేకుండ