పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

లనే వాడుచున్నారనియు, నేనక్కడి జ్యోతిష్కుల వలననే యెఱిఁగిన వాఁడ నగుటచేత మీకు నుబోధమగుటకయి యింగ్లీషు తిధులను వాడితినేకాని నాకు తెలియకకాదు. ఈకలి కాలిము నందు సహితము జ్యోతిష మిట్లు ప్రత్యక్ష నిదర్శనముగా నున్నదికదా! లంకాద్వీపము నందు జ్యోతిశ్శాస్త్రమే ప్రబలియుండని పక్షమున ద్వీపాంతరమునం దేకాకినయియున్న నేను దూరదేశము నందలి మీస్ధితిగతుల నెఱుఁగక తిధి మాస సంవత్సరాదులను మీకు దురవహమగునట్లు బార్హస్పత్యమాన ప్రకారముగా తెలిపియుందును. నాకింతటిది దివ్యఙ్ఞనము ప్రసాదించిన యో జ్యోతిశ్శాస్త్రరాజమా : నీకు పదివేల నమస్కారములు పశ్చిమ ఖండమునుండి హూణులు తెచ్చి విడుచుటచేత నిప్పుడుభరఖండమునం దెల్ల యెడలను పిశాచములవలె సంచరించుచున్న ప్రకృతిశాస్త్రములను భయపడక నిఅన మాదేశము నెప్పుడును విడువక మావారి హృదయపీఠముల సధిష్ఠించి రాజ్యము చేయుచుండుము. సంధ్యావందన విసర్జనకధనముచేత శాస్త్రొల్లంఘనము చేసినట్లు పామరులు భావింతురన్న భీతిచేత జ్యోతిశ్శాస్త్రమునుబట్టి నేనెఱిఁగిన ఈసత్యమును గ్రహించి జ్యోతిషమును మునుపటికంటె నెక్కువగా గౌరవింతురని నమ్ముచున్నాను.

నేను లంకాద్వీపమును జేరినతరువాత సనెటు పోదునాదునాయని యాలోచించుచు క్షణకాల మొక మఱిచెట్టు నీడను గూర్చున్నాను. మఱి చెట్టుని చెప్పఁగానే యది మనదేశపు మఱిచెట్టు వంటిదేనని మీరనుకో వచ్చును. కాని అది ఆకారమునందుమన మఱ్ఱిచెట్లనే పోలినను పరిమాణమునందు మాత్రము శతగుణము లధికమైనదిగా నున్నది. దాని యాకులు మనదేశమునందలి తామరాకు లంత లేసి యున్నవి. దాని పండ్లు పెద్దతాటికాయలంతలేసి యున్నవి; చిన్న