పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివాదిక్రిమి పర్యంతం ప్రాణినాం ప్రాణవర్త్మనాం
విశ్వాసోచ్చ్వాసరుపేణ మంత్రోయం వర్తతేప్రియే.

అని కేవల సదాశివుఁడే శ్రీమహాదేవికి " మనయిద్దఱ పరమకారా మయినట్టియు ఊర్ధ్వామ్నాయ (తంత్ర) ప్రతిష్టతమయినట్టియు శ్రీ ప్రాసాద పరామంత్రము నెవ్వఁ డెఱుగునో వాఁడు తానేశివుఁడు. ఓ ప్రియులారా! శివాది క్రిమి పర్యంతమునుగల జీవ జంతువులలో నిశ్వాసోచ్చ్వా సరుపము చేత నీమంత్రము వర్తించుచున్నది." అని యుపదేశించియున్నడు."హ్స" అను ప్రాసాద మంత్రములో హకారము నిశ్వాస రూపమనియు , సకార ముచ్ఛ్వాస రాపమనియు తెలియవలెను. శాస్త్రప్రమాణము కలిగి యుండుట చేత మనపురుషులలో నిదిసదాచారమేయయినను స్త్రీలలో మాత్ర మిదిదురాచరమని నేను భావించెదను; ఆదేశమునందేలాగుననో స్త్రీలు స్వతంత్రురాండ్రయి తమ కనుకూలముగా శాస్త్రములను తాఱుమాఱు చేసినందున, ఈయనర్ధమంతయు పుట్టినది. ఆసంగతి పోనిచ్చి కథాంశమును వినుఁడు.

సాభాపత్నులు శ్రీజగద్గురువులవారి యాజ్ఞ నంతగా మన్నించక పోవుటయు , అందుచేత మతధర్మము లాచరణములేక చెడిపోవలసినగతి సంభవించుయు చూచి ఖేదపడి గంభీదంభీగారు జీర్ణమతోద్ధారణమునకు గురుభక్తి నిలుపుటకు సభచేసి పూర్వాచాగ శాస్త్రమహిమలను భూషించుచు, నవనాగరికురాండ్రను దూషించుచు, గొప్ప యుపన్యాసము చేసిరి. అదిమిక్కిలి పెద్దదగుటవలన దానిక డపటి భాగమును మాత్ర మిందు తెలిఁగించెదను:

" ఓమహాకాంతలారా! నాయుపన్యాసము విన్నారు కదా! ప్రజలేట్లు చెడిపోవుచున్నరో కన్నారు గదా! నవ నాగరికకు రాండ్రలన దేశమునకు ఁ గలుగుచున్న యనర్ధములను గనిపెట్టినారు గదా! వారిప్పుడు పురిషులకు విద్య కావలెననుచున్నారు; రేపు అపత్నీకుల