పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరిలో నొకతెను దీసికొనివచ్చి కౌలికుఁడు శక్తి పూజచేయ వలెను. అర్ధరాత్రము నందు నవకన్యలనుతెచ్చి.... తత్సంబంధమైన మంత్రమును లిఖించి దానిని పూజింపవలెను. శ్రీచక్రమున వామభాగము నందు తలవిరియఁ బోసికొన్నదియు దెసమొలదియు సర్వాభరణ భూషితము ఆనందలీన హృదయయు సౌందర్యాతి మనోహరయు అయిన యాభైరవీకన్యను నిలువఁబెట్టి సురానందామృత జలముతో శుద్ధిమంత్రము చేతశుద్ధి రాలినిచేయవలెను. ఆనందవిగ్రహుఁడయినవీరుఁడు ఆనంద తర్పితురాలయిన యాకాంతను శ్రీచక్రమునందు రతిచేతతృప్తి నొందించవలెను. త్రాగిత్రాగి భూమి మీదపడువఱకు నుమరలత్రాగి లేచి మరల త్రాగి పునర్జన్మము లేని వాఁడగును" అనిపయి ప్రమాణవచనముల తాత్పర్యము. ఈప్రకారముగానే యచ్చటిజగద్గురువులవారునుశీధనమయమునందు శ్రీచక్రమునందు ప్రాసాదముద్రను పూని ఈశ్వరాత్మకముగా నొక యౌవన పురుషుని పూజించి సంభోగించి సురాపానము చేసి యానందపరవశులగు చుందురఁట! మనదేశము నందువలెనే యాదేశమునందును శాస్త్ర విశ్వాసమును మత ధర్మాచరణమును తక్కువగుట వలన జగద్గురువు లీ మతధర్మమును స్వాచరణమువలనఁ జూపువఱకును దానినిజనులు మఱచి పోయినట్టేయున్నదిగాన, నేనున్నకాలములో రంఢీనగరము నందీయాచారము కనఁబడమేలేదు. ఇదికలి మహిమయని గురువులయభి ప్రాయము.

ప్రాసాదమంత్ర మహిమము మమంత్ర విశ్వాసములేని నవనాగరికులకుఁదెలియకపోవచ్చునుగాన వారియుపయోగము నిమిత్తమిందుసప్రమాణముగా కులార్ణవతంత్రము నుండితెలిపెదను. దీనినిబట్టియే నాది యప్రామాణికవాదము కాదనియు,సర్వజన సమాదరణీయమనియు, బుద్ధిమంతులు గ్రహింపవచ్చును.

శ్లో.శ్రీప్రాసాదపరామంత్రమూర్ద్వామ్నాయప్రతిష్ఠితం
ఆవయోఃపరమాకారంయోవేత్తిసఃశివఃస్వయం.