పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ణాచారముత్తమము; దక్షిణాచారముకంటె వామాచారముత్తమము; వామాచారము కంటె సిద్ధాంతముత్తమము; సిద్ధాంతమునకంటె కౌలముత్తమము; కౌలమునకంటె శ్రేష్ఠతరమయినది లేదు " అని ప్రమాణ వచనముల కర్ధము.ఇప్పుటుకౌలముయొక్క శ్రేష్ఠత్వము స్థాపనమయినందున, కౌలాచారమును సప్రమాణముగా శక్తిశోధనతంత్రము నందుఁచెప్పఁబడినరీతిగాఁ గొంత వివరించెదను:-

శ్లో.నటీకాపాలినీవేశ్యారజకీనాపితాంగనా
బ్రాహ్మణీశూద్రకన్యాచతధగోపాలకన్యకా
మాలాకారన్యకన్యాపినవకన్యాఃప్రకీర్తితాఃఏ
తాసుకాంచిదానీయపూజయేచ్చక్తికౌలికః

మహావిశాయామానీయనవకన్యాశ్చభైరవాన్

తదీయంమంత్రమాలిఖ్యతస్మిన్తామేవపూజయేత్
క్రేస్థాపయేద్వామేకన్యాంభైరవవల్లభాయ్.
ముక్తకేశాంవీతలజ్జాంసర్వాభరణభూషితామ్
ఆనందలీనహృదయాంసౌందర్యాతిమనోహరామ్
శోధయేచ్చుద్ధిమంత్రేణసురానందామృతాంబుఖిః

ఆనందతర్పితాంకాంతాంవీరఃస్వానందవిగ్రహాః
రితేనతర్పయేత్తత్రశ్రీచక్రేవీరసంసది

పీత్వాపీత్వాపునఃపీత్వాయావల్లుఠతిభూతలే
ఉత్థాయచపునఃపీత్వాపునర్జన్మనవిద్యతే.

మఱింత పచ్చి బూతుగా నుండునని కొన్ని ప్రమాణ వచనములను వదలివేసినందుకు చదువరులునన్ను మన్నింపవలెను. "నటియు, కాపాలివియు, వేశ్యయు, చాకలిదియు, మంగలిదియు, బ్రాహ్మణియు, శూద్రయు, గొల్లదియు, పూలుగూర్చునదియు,నవకన్యలనఁబడుదురు.