పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

మాంసభక్షకులకును, వ్యభిచారులకును వెలిలేక లోకాభివృద్ధి నిమిత్తమయి యత్నించుచున్న తమకు నిష్కారణ్ముగా బహిష్కారమువేయుట యేమి న్యాయమని నాయజమానురాలు భయపడక జగద్గురువులవారి నడిగెను. అప్పుడు తదాస్థానపండితురాండ్రలో నొక వృద్ధాంగన యందుకొని శాస్తోక్తప్రకారముగా నడచుకొనువారి నేల బహిష్కరింప వలయుననియు,

"మాఖే మాఘే మాఠే మాఢే
మాధే మామే మిమే మిమే"

అను శాస్త్రప్రమాణమునుబట్టి పయిపనులు చేసినవారు దోషులు కారనియు, సమాధానముచెప్పెను. ఆప్రమాణవచనమున కర్ధమేమో సెలవియ్యవలసినదని నేను వేఁడుకొనఁగా, ఆమహాపండితురాలు నాయందనుగ్రహించి, "మద్యము, మంసము, మత్స్యము, ముద్ర, మైధునము, అను మకారములు మహాపాపనిరాకరములు" అనిచెప్పెను.ఈయొక్క వచనముతోనే

"మద్యంమాంసంచ మత్స్యంచ ముద్రా మైధున మేవచ మకారపంచకంచైవమహాపాతక నాశనం"

అను ప్రాణితోషిణి గ్రంధములోని శ్లోకము నాకు స్మరణకువచ్చి రంఢీ శాస్త్రములన్నియు హిందూశాస్త్రములనుండియేతీసికొనఁబడినవనియు వారి వేదమును మనవేదశాఖయే యనియు నేను నిశ్చయముచేసితిని. అప్పుడు నీతికి విరుద్ధమయిన శాస్త్రమెట్లు ప్రమాణమగునని నాయజమానురాలా విద్వాంసురాలిని నిశ్శకముగా నడిగెను. అందుమీఁద నామె యత్యాగ్రహావేశము కలదయి శాస్త్రతిరస్కారమును జేసినందునకయి మఱియొక ముఖము చూచిన పాపమువచ్చునని కోపపడి, ఈయనర్ధ మంతయు రాజకీయపాఠశాలలోఁ జదువుటవలన వచ్చి