పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుటకు శీఘ్రకాలములోనే గ్రామమునకు విజయము చేయఁబోయెడు జగద్గురువులను ప్రార్ధింప వలయుననియు, ఐకకంఠముగా నిశ్ఛయము చేసికొనిరి.

ఇట్లు సభలు జరుగుచుండఁగానే జగద్గురువులవారు తాము విచచ్చేయుచున్నట్లు సభాపత్నులకు శ్రీముఖమును బంపిరి. శ్రీముఖము వెనుకనే శ్రీవారును గుఱములతో ను ఏనుఁగులతో ను వాధ్యములతోను విజయుంచేసిరి.అప్పుడింటింటను భిక్షలు జరుగుట కారంభించినవి.ఉద్యొగములో నున్నవా రొక్క రొక్క రు మూఁడేసి నెలల జీతము పాదపూజ సమర్పించుకోవలసి వచ్చినది. అప్పుడింటింటను నాసికాహొత్సములు జరగ మొదలు పెట్టేను .ఆనాసికోత్సవములో మొట్టమొదట నాసహధ్యాయుఁడై న భాఢిఫొడ్ యొక్క ముక్కు ముక్కలయ్యొను .ఇతర సమయములయందు పట్టుదల లేకపొయినను స్వాములవారు వచినప్పుడు మన దేశమునందు భాల వితంతువుల శిరోజములు సహితముతీయించి వేయునట్లుగానే యాదేశమునందు జగద్గురువులు వచినప్పుడపత్నీకుల ముక్కులన్నియుకోసివేయుదురు. జగద్గురువులవా రక్కడ నున్నకాలములో నొక సభచేసి యాసభకు నా యజమానురాలయినఫాంఢీభంగీగారినికూడ పిలిపించిరి. అప్పుడు పురుషవిద్యాభ్యాసముకూడదని యేశా స్త్రములలోఁ జెప్పఁబడియున్నదని ఫాంఢీభంగీగారు జగద్గురువులను ప్రశ్నవేసిరి. నిత్యమును భిక్షలధికముగాఁ జేయుచుండుటవలన జగద్గురువులవారికి పిండివంటల నామము లేకాని పు స్తకముల నామములు రానందున, ఆప్రశ్నకుత్తరము చేప్పవలసినదని ::::::వారాఅస్ధాన:::::: విద్యాంసురాండ్రయిన:::::: శిష్యురాండ్ర కాజఞపించిరి. ఆ మహవిద్వాంసురాండ్రును కొంచెముసే పాలోచించి తాము స్వస్ధానమునకుపోయిన తరువాత మూలపీఠమువదనున్న యనాదిగ్రంధమును దీసి పు స్తకముల నామములను వెనుకనుండి పంపెధమని చెప్పించులకొనిరి. త్రాగుఁబోతులకును,