Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలైనవాని యందుఁబఠింపవలసినదే కాని వాని యర్ధముతో పనిలేదనియు, విద్వాంసురండ్రు వాదింపసాగిరి.ఆవాదములో పండితురాండ్రలో పండితురండ్రకు వేదమున కర్ధమున్నదా లేదాయన్నమీమాంసయొకటి యవాంతరముగా వచ్చినది.అప్పుడు పండితరండ్రలో మూఁడువంతులు వేదమున కర్ధమేలేదనియు, అర్ధమున్నట్టుతామెప్పుడును పెద్దలవలనవినలేదనియు, అర్ధమేయున్నపక్షమునజనులొక్కరైననేల యభ్యసింపరనియు, అర్ధములేకపోవుటచేతనే వానికాపూజ్యత వచ్చినదనియు, వాదించి యర్ధములేనట్టే సిద్ధాంతముచేసిరి; ఒకవంతు మాత్ర మాకాలమునందు మనుష్యుల కెవ్వరికిని తెలియక పోయినను వేదముల కర్ధమున్నదనియు, వేదములకర్ధమున్నదని తమ తాతముత్తాతలు తమతో చెప్పునట్టు తమ తాతలవలన చిన్నప్పుడువిన్నామనియు, వేదార్ధములే శాస్త్రములని శాస్త్రములలో జెప్పఁబడియున్నదనియు, వాదించిరి కాని యధికసంఖ్య గలవారిచేత వారివాదముపూర్వపక్షము చేయఁబడినది. ఆసభలో నవనాగరికులైన యొక తె లేచి నిలిచి దొరతనమువారు మనపూర్వగ్రంధములను సంపాదించుటకు ప్రయత్నము చేయుచున్నారనియు, ఒకపురాతన దేవాలయములో మూలఁబడియున్న జీర్ణతాళపత్రపుస్తకముల కట్టనువిప్పి శోధింపఁగానందులో వేదమునకు వ్యాఖ్యానమొకటి కనబడినదనియు, వారుదానిని పరిశీలించి ముద్రింపించుచున్నారనియు, వేదమునకర్ధము కలదనియు చెప్పెను.ఆమె మాటలు విద్వాంసురాండ్రెవ్వరును నమ్మక స్వదేసస్థులకెవ్వరికిని దొరకనిపుస్తకము వారికి దొరికియుండదనియు,దొరికినను విద్వాంసురండ్రకు కానియర్ధము వారికిగునని నమ్మఁగూడదనియు దేవాలయములోని ప్రాఁతపుస్తకములలోనిదని చెప్పియేదో యర్ధమును కల్పించి ముద్రించుచున్నారనియు, ముద్రితగ్రంధమును ముట్టినను పాపమువచ్చునుగాన దానినికొన్నవారినిచదివినవారిని బహిష్కారము