పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూసుకొని కూరుచుండి ప్రతిదినమును పగలు రెండు యామములవఱకును రేఁగుగింజల జపమాలిక త్రిప్పుచు జపముచేయుచుండును.మన దేశములో రుద్రాక్షలవలెనే యాదేశములో బదరీబీజములు మిక్కిలి పవిత్రమయినవి.ఇక్కడవలె నక్కడదేహమున విభూతిధరించరు. మనదేశమునందువలె మూఁడు రేఖలుఁగాగాక యొక్కటేరేఖగా లలాటమునందంతటను భూరేణువుపూసికొందురు.అందులో శోణమృత్తికపరమపావనమైనది. తదభావమునందు నదులలోనిదిగాని, తదభావమునందు చెఱువులలోనిదిగాని, తదభావమునందు నూతులలోనిదిగాని ఏమృత్తికయైనను ధరింపవచ్చును. మనగంభీదంభీగా రొక్కలలాటమునందు మాత్రమేకాక దేహమునందంతటను జేగురుమట్టినే పూసికొనిపూచిన మోదుగువలె కన్నులపండువగాఁగానఁబడుదురు.ఆమెకుఁగల భక్తియు మితంతయుఁజేయుదు.ఆమె దేవతానివేదనము చేయకకల్లయినను త్రాగదు; మాంసమయినను తినదు;దేవతార్పణము చేయకచౌర్యమునయిననుజేయదు.వేయేల? ఆమె తనదేహమును దేవతాసమర్పణముచేసియే వ్యభిచరించును.జ;తనజిహ్వను దేవాఅసమర్పణముచేసియేకల్లలాడును.ఆత్మ కర్తృత్వముంచుకొనక కర్మనిష్ఠులు మన దేశమునందు"తత్సత్ బ్రహ్మార్పణమస్తు" అని కర్మలనన్నిటిని బ్రహ్మార్పణము చేసినట్లే యామెయు తనకర్మలనన్నిటిని స్వదేవతకు ధారపోయును. కాఁబట్టియామెయీపనియు తన యిష్టదేవతాప్రీతికొఱకేచేయ దీక్షవహించినందున, అభీష్టసిద్ధికయి ప్రతిపక్షులవిషయమున నేదారణకృత్యమును జేయుటకును పాపభయ యామెకులేదు.కాని దొరతనమువారి భయముండుటచేత లోలోపలనెన్నికానిపనులు చేసినను తత్పక్షమువారు ప్రత్యక్షముగా ప్రతిపక్షులతలలు బద్ధలు కొట్టిదౌర్జన్యముచేయుటకు మాత్రము సాహసింపకుండిరి. రాజకీయోద్యో