పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గినులయిన రంఢీ దేశవాసినులకు పలువురుకింకొక కష్టముకూడ వచ్చినది.వారావల సత్యప్రియలైన నవ నాగరికాగ్రగణ్యలయినట్టుగా నటించితమ పయియధికారిణుల మెప్పుపొందకవలయును; ఈవల పూర్వమతాచారాభిమాననీయలయినట్లు నటించి మూఢప్రజలను సంతోషపెట్టవలయును; మధ్యను తమ హృదయములన్నియు నవనాగరిక పక్షముననే యుండుటచేత సంస్కారములను మెల్లగా నెలకొల్పుట నిమిత్తమేపైకి పూర్వ నాగరికపక్ష మవలంబించినట్లు మెలఁగవలసి వచ్చినదని నవనాగరికురాండ్రను సమాధాన పఱపవలయును.కాఁబట్టివీరు నాటక ములయందలి నటులవలె మూఁడు చోట్లమూఁడు విధములయిన వేషములు వేసి పరస్పర విరుద్ధములయిన మూఁడు కధలను వినిపించవలసిన సామర్ధ్యమును వహించినవారయినారు.వీరు దేనియందును నమ్మకములేనివారయు దురభిమానదేవుని దుశ్చింతాదేవిని మాత్రమేభక్తితో కొలుచు వారగుటచేత తత్పీృతికరముగా వారు శ్రద్ధతో చేయునదియంతయు సాధుసంతాపప్రయత్నము తప్ప మఱియొక్కటి కానరాదు.

ఇంట తల్లిదండ్రులు బాలికలను భాధింపుచు పురుషవిధ్యాభ్యాసము మంచిదన్న పక్షమునను మంచిదన్న పక్షమువారితో చేరిన పక్షమునను గృహములముండి వెడలఁగొట్టెదమని బెదిరించినందున వారిలో పలువురు వాదము చేయుటకును నవనాగరికలతో మాటాడుకకునుమానుకొనిరి.కొందఱుతల్లులంతటినైననూరకుండక పాఠములుమానివేసి పంచకాలములయందును"మిధా" చేయవలసినని సంధ్యావందనమువంటి నిత్యకర్మ.ఈనిత్యకర్మను ప్రతిస్త్రీయును ప్రాతఃకాలము,పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము అను పంచకాలములయందును తప్పకచేయవలయును. అది చేయనివారికిగతులులేవు.అయినను పట్టణములయందలివారు మిధాచేయునట్లు