పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/305

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

కారంభిచెను. ఆయుపన్యాసములవలనను రాజబాషాగ్రంధపఠన మహత్త్వమువలన మనసు కరఁగినవారయు కొందఱుబాలికలెన్నికష్టములకయిన నోర్చి పురుషవిద్యాభివృద్ధిని జేయుటకు నిశ్చయించుకొని నాయజమానురాలికి సర్వవిధములతోడ్పడుచు, వెలివేయఁబడినయామెతోఁగలిసి రహస్యముగా భోజనములు చేయుటకారంభించిరి.అందుచేత రంఢీ నగరములో మఱింత సంక్షోభము కలిగెను. రాజభాషవలన పిల్లలు చెడిపోవుచున్నారనియు, వారినందఱిని రాజకీయపాఠశాలకు బోకుండమాన్పించి వారికిరంఢీమతమునుభోధించి వారిని పూర్వపదాచార నిష్ఠురాండ్రను జేయవలయుననియు, విద్యాంసురండ్రచేత వారమునకు రెండుసారులు బాలికలకు మతబోధ చేయింపవలయుననియు, లౌక్యాధికారలులోనున్న పురములోని ప్రముఖరాండ్రు నిశ్చయముచేసి సభలు చేయించుటయేకాక, తమగ్రామమున కొక్కసారి విజయము చేసి జీర్ణోమతోద్ధారణము చేయవలెనని పీఠాధిపత్నియైనమతాచార్యురాలికి విజ్ఞాపనము పంపిరి.నవనాగరికురాండ్రకు మాయజమానురాలు నాయకులైనట్టే పూర్వాచారపరాయణలయిన పూర్వనాగరిక పక్షమువారికి దుంఢీలంఢీగారు ,నాయకురాలయి, తనయావచ్చక్తిని వినియోగించి సంస్కారపక్షమువారిని ముఖ్యముగాఁదత్సక్షానుసారిణు లయిన బాలికలను బాధించి పూర్వాచారస్థాపనము చేయమొదలుపెట్టెను. దుంఢీలంఢీగా రాపట్టణమునకుఁ బ్రాడ్వివాకురాలు. రాజకీయోద్యోగము నందుంటవలన నవనాగరికపక్షావలంబకులయిన దొరతనము వారికి విరోధముగాఁబనిచేయుటకిష్టములేనిదై, తానుచాటున కపటనాటకమునకు సూత్రధారులుగానుండి యామెయాగ్రామములో మిక్కిలి కర్మిష్ఠురాలని ప్రసిద్ధిచెందిన గంభీదంభీగారిని నాయకురాలినిగాఁజేసెను. ఈగంభీదంభీగారు లోకములోని కర్మిష్ఠురాండ్రలో నగ్రగణ్యురాల; ప్ర్రాతఃకాలముననే స్నానముచేసి ముక్కు