పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీఁద ఫిండీగారు నా చేత నీశ్లోకములను శ్లోకార్ధములను రెండు పారులు విని, కన్నులు మూసికొని కొంతనేపాలోచించి నిమోసమిప్పటికి తెలిసినదని చిటికెవేసి, మొదటి శ్లోకములో "భార్య" యను చోట "భర్త" యనియుండువలె ననియు, "పుత్రుడు దానుఁడు శిష్యుఁడు భ్రాతి సోదరుఁడు" అని శ్లోకములో చెప్పఁబడిన వారందఱును పురుషులయి యుండఁగా మొదటి "భార్య" యని యొక్క స్త్రీయుండుట సంభవింపదనియు, అందుచేత నిదికుడ "భర్త"యని యుండఁగా నేను పరిహాసార్థముగా "భార్య"యని మార్చి చదివితిననియు, సిద్ధాంతము చేసి యంతటితోనైన నూరకూండక పురషులకు చదువువచ్చిన యెడల నట్టియనర్థములు సంభవించునని యెఱిఁగియే బుద్ధిమంతులయిన తమ పూర్వులు పురుష విద్య కూడదని సిద్ధాంతము చేసిరని తనయభాప్రాయమును బయలపెట్టినది. అక్కడ నాపక్ష మవలంబించి మాటాడు వారెవ్వరును లేకపోయినందున నా వాదబలమును నేనెఱిఁగియు వివాదము కూడదని యూరకుండవలసినవాఁడనయితిని.

అయినను నేనంతటితో నూరకుండక మన దేశములో పురుషులే స్వతంత్రులనియు, స్త్రీలు పురుషులకు లోఁబడియుందురనియు, మనుస్మృతిలో నుండి నెనుదాహరించిన ప్రమాణములు సత్యమయినవనియు, ఆమెకేలాగూనైనను మననునపట్టింపవలెనని నిశ్చియించుకొని పతివ్రతాధర్మములను గూర్చి మన పురాణాదులలోఁగల విషయము లనేకము లామెకుఁజెప్పితిని. చిప్పినవానినెల్ల నామె యాదరముతో విన మొదలు పెట్టినందున నాకుఁ గొంతప్రోత్సాహము గలిగి పతివ్రతాధర్మముల నామె మనస్సుకుఁ జక్కగా పట్టించనెంచి భర్త యెంగిలి భుజించుట పత్నికి పరమధర్మమని చూపుటకయి నాలాయనికథ నారంభించి యిట్లు చెప్పుఁజొచ్చితిని.