Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వకాలమునందు నాలాయనియైన యింద్రసేన మౌద్గల్యునకు భార్యాయయ్యెను. అతఁడు కుష్ఠరోగపీడితుఁడు. ఆ మహా పతివ్రత యాతనియుచ్ఛిష్టమును ప్రతి దినమును అమృత తుల్యముగా భక్షంచుచుండును. భోజనము చేయుచున్న కాలమునం దొకనాఁడతని యంగుష్ఠము తునిగి యన్నములోఁబడెను. అట్లుపడినను పతివ్రతా శిరోమణియైన యామె రోఁతపడక యాబొట్టనవ్రేలిని దీసి భక్తితో దూరముగా నుంచి యెంగిలియన్నమును పరమాన్నమువలె తినెను. అదిచూచి...

ఇంతవఱకుఁ జెప్పునప్పుటి కామె చెవులమూసుకొని నామట కడ్డమువచ్చి, పురుషుఁడైనైన నేనిన్నికథ లొక్కనిమిషములో కల్పించుట సంభవింపదని యెంచి మనకు శాస్త్రములు న్నవనియు వానిలో భర్తృశుశ్రూషాదులు చెప్పుఁబడియున్నవనియు కొంత వఱకు నమ్మినను నన్నాకథను సాంతముగాఁ జెప్పనీక, దురాగ్రహగ్రస్తురాలయి మన శాస్త్రములు రాక్షసులు చేసిన పాడుకథలని దూషించెను. అప్పుడు నేనును కోపమునుపట్టఁజాలక గురుధిక్కారపాపము వచ్చినను సరేయని యెదురుకొని మాటకు మాఱుమాటయాడి కొంత సేపు వాక్కాలహమునకు డికొంటిని. నన్ను దూషించినను నేనూరకుందును గాని శాస్త్రములను దూషించిన తరువాత శాస్త్రబద్ధుఁడనైన నేనెట్లురకూండఁ గలుగుదును? మా వాక్కలహము వలన నాటి సంభాషణ యంతటితో ముగిసినది. అందమూలమున నేను జప్పుఁదలఁకొన్న స్త్రీ ధర్మముల నామెకుఁ జప్పులేకపోతినిగదాయని నాకు విచారము గలిగినదిగాని మించినదానికి వగచిన ప్రయెజనముండదు. నాకు పాఠాముచెప్పక కోపముతో నాటిదినమామె తనయింటికి పోయినది. అంతటితో నా చదువునకు విఘ్నము వచ్చునట్లు కానఁబడెనుగాని యామె దీర్ఘక్రోధురాలు కానందునను, నేనుపోయి యామెకు క్షమార్పణము చేసి