పఱువవలెనని యిచ్చట స్త్రీలు పురుషులను కొట్టుట యెంత సత్యమో మా దేశమునందు పురుషులు స్త్రీలను కొట్టుట యంత సత్యమేయనియు కావలసిన యెడల మీకు నమ్మకము పుట్టునట్లుగా మా శాస్త్రముల నుండి కావలసినన్ని ప్రమాణ వచనమును జూపెదననియు, జెప్పి స్మృతూలలోనెల్లను సర్వోత్కష్టమయిన మనుస్మృతి యెనిమిదవ యధ్యాయము నుండి యీక్రింది శ్లోకములను జదివితిని.
శ్లో. భార్యా పుత్రశ్చ దానశ్చ శిష్యో భ్రాతాచ సోదరః ప్రాప్తాపరాధా స్తాడ్యాః స్యు రజ్జ్వా వేణుదండేనవా.
శ్లో. పృష్టతస్తుశరీరస్య నోత్తమాంగే కథంచన అతోన్యధాతు ప్రహర్ర ప్రాప్తఃస్యా చ్చౌరకిల్బిషమ్.
అప్పుడామె వీనియర్ధమేమని నన్నడిగినది. భార్యాను, పుత్రుని, సేవకుని, శిష్యుని, భ్రాతను, సోదరుని, తప్పు చేనప్పుడు త్రాటితోనైనను వెదురుకఱతోనైనను కొట్టవలయునని మొదటి శ్లోకమున కర్ధమనియు, శరీరము యొక్క వెనుకటి భాగమందే కాని నెత్తి మీద కొట్టరాదు మఱి యొక చోట కొట్టినవాఁడు చోర పాపమున పొందునని రెండవ శ్లోకమున కర్థమనియు, చెప్పి యాపయిని "ప్రాప్తాపరాధా" యని మూలములో నున్నను కొట్టుట ప్రధానముగాని నేరము చేయుట ప్రధానము కాకపోవుట చేత మా దేశములో పురుషులు నేరము లేక యే భార్యలను కొట్టుచుండుట శిష్టాచారమైనదనియు, నెత్తిమీదకొట్టఁ, గూడదని కూడ మూలములోఁ గానఁబడుచున్నను నెత్తకూడా శరీరములోని భాగమేయైనందున నెత్తి మీఁద కూడ శాస్త్రార్ధము ముందు భాగముందు బెత్తెడు మేరవదలివేసి వెనుకతట్టున కొట్టవచ్చనని వాక్య సమస్వయము చేసి సిద్ధాంత మేర్పఱిచి కర్మభూమియైన మా దేశమందలి పెద్దలు భార్యలను శిరస్సుమిఁదనే కొట్టుట సదాచారమయిన దనియు, నేను మనుస్మృతికి వ్యాఖ్యానము చేసి యర్ధ వివరము చేసితిని. ఆందు