పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేతుకల్పనములతో వ్యాఖ్యానము చేసి పురుషదండనము వలని లాభములను తెలుపుచుండఁగా, నా మనోగతి నామె కెఱుకపఱుప కుండవలెనని నేనెంతప్రయత్నము చేసినను నా మనస్సులో హాలాహలము వలె పుట్టి పయికి పొంగుచున్న కోపాగ్నియాగక నా కన్నుల వెంట వెడలఁజొచ్చినందున అసూయతో మొగ మింకొకవంకకు త్రిపుకొంటిని. ఆ నీతి నాకు రుచింపకున్నదని బుధ్దిమంతురాలయిన యామె గ్రహించి, పురుషులను స్త్రీలు కొట్టక యాదరింపవలెనని బోధించెడు యా దేశపు నవనాగరికుల మతము నాకు సమ్మతమనుకొని, అప్పుడే విద్యాభ్యాసములను మతిమాఱి నేను చేడిపోవుచున్నానని నానిమి తమకొంత వ్యసనపడి, ఈ విషయమున మీ దేశములో నేమియాచారమని నన్నామెయడిగెను. "బ్రాహ్మణస్యక్షణంకోప" మన్న నీతిని బట్టి శాంతిజలము చేత నేను కోపాగ్నిని నిమిషముతో చల్లార్చుకొని నవ్వు మొగముతో "మా దేశమునందు పురుషులే స్త్రీలనుకొట్టుదురు." అని సత్యము జెప్పితిని. నేను నవ్వులకు సహిత మసత్యము పలుకునని యామెతెలిసికోలేక, నావి పరిహాసోక్తులని భావించి నా మాటలను నామె నమ్మినదికాదు. ఈ రఁఢీదేశములో సదాచారసంపన్నలయిన స్త్రీరత్నములు నిత్యమును తమ పురుషులను వేణూదండముతో దండించుచుందురన్నచో ప్రత్యక్షానుభవము లేక పోవుటచే మాఫింఢీగారి వలేనేమిరును నమ్మకపోవచ్చును. కాని నేనిక్కడ కన్నులార ప్రత్యక్షముగాఁజూచిన సత్యములను వేదవాక్యాములవలె చెప్పుచుండట చేత పురాణగాధలను నమ్మ నలవాటుపడిన మీరుమాత్ర మట్టి యవిశ్వాస పాపమును గట్టుకొనరని నేను దృఢముగా నమ్ముచున్నాను.

ఆమె నామాటలను నమ్మక యట్టి వైపరీత్య మిశ్వరసృష్టిలో సంభవింప నేరదని వాదించుటచేత నా సత్యసంధతను గూర్చి సంశయ పడినందున కెంతయుఁ జింతనొంది, నామాటలనిజ మామెకు తేట