Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాపాపాత్ముఁడునారక

                    కూపంబునఁగూలుఁజూవె కోటియుగంబుల్‌.       ౫
              క.    దూరమునఁజూచి పత్నిని
                    గారవమునలేచి యొంటికాలునఁబురుషుం
                    డోరఁగవంగఁగవలయును
                    గూరిమిఁగూర్చుండనిల్వఁగూడదుసుమ్మీ.         ౬
              క.    పురుషుడును గార్థభమున్‌
                    స్థిరముగ దండనములేక చెడిపోదురిలన్‌
                    గరుణఁదలంపక నెలకొక
                    పరియైనన్‌ గొట్టవలయుఁ బత్ని పురువునిన్.     ౭
              గీ.    పత్ని గొట్టినఁదిట్టిన బాధయిడిన
                    భోగపురుషులఁ బొందినఁ బొందకీర్ష్య
                    దరుణియే వురుషునకును దైవమనుచు
                    భక్తిననయంబు సేవింపవలయుఁజుమ్ము.        ౮
              గీ.    అతివలకు స్వేచ్చభూపణమైనయట్లు
                    పురుషులకు లజ్జయే మహాభూషణంబు
                    సూర్యచంద్రులు మొగమైనఁజూడకుండు
                    పరమపత్నీవ్రతుఁడెపొందుఁబరమగతులు.       ౯

ఫిండీగారు నాకు బహు విషయములను గూర్చి నీతులను బోధించుచు వచ్చినను చదివి చెడిపోదునేమోయను భీతిచేత నాకు ముఖ్యముగా ప్రతిదినమును తప్పకయెంతో శ్రద్ధతో పత్నీవ్రత ధర్మముల నుపదేశించుచుండెను. ఒకనాఁడావిద్వాంసురాలు నేను తెనిఁగించిన నవరత్నములలో నేడవరత్నమయిన “పురువుండును గార్థభమున్ స్థిరముగదండనము లేక చెడిపోదురిలన్‌” అనుదాని మూలశ్లోకమును నాకుత్సాహముతో బోధించి, ఆదండనము పురుషుల మేలుకొఱకేయని